రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ చేస్తున్న అరాచకాలు, ఆపద్దర్మ ప్రభుత్వం అయి ఉండి కొత్త అప్పులు వల్ల ఎంతో ప్రమాదం ఉంటుందని వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి అన్నారు.  ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల్ని ప్రభుత్వం ఎన్నికల విధుల్లో వినియోగించింది. బాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్న చోటే హింస చెలరేగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే సూరి మా కార్యకర్తలపై దాడి చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాద్దాంతం చేస్తున్న టీడీపీ... స్ట్రాంగ్‌రూంలను కూడా ఏమైనా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.  

బాబు మాటల్ని జాతీయ స్థాయి నాయకులు నమ్మొద్దు.   చంద్రబాబు కి ఓటమి భయం పట్టుకుంది.  ఏపి అసెంబ్లీ స్పీకర్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి అక్రమాలకు పాల్పడ్డారు.  ఈసి నియమావళి ఉల్లంఘిస్తున్న టీడీపీపై ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.  ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో సీఈసీని కలిసి తమ వినతీ పత్రం అందజేశారు.  


కేంద్రబలగాల పర్యవేక్షణలో ఈవీఎంలను ఉంచాలని విజ్ఞప్తి.  వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బృందంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి.రామచంద్రయ్య,అవంతి, బుట్టా రేణుక లు ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: