తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి భాషాభిమానం,  ఆత్మ గౌరవం, తెలుగు పౌరుషం ఇలా చాలా ఆలోచించి పార్టీకి పేరు పెట్టారు. అన్న గారి టైంలో పార్టీలో తెలుగు కొంత వెలిగింది. ఇక అల్లుడు జమానాలో తెలుగుకు నేతి బీర కాయ చందం గతి పట్టింది. ఇక ఆయన కుమారుడు, భావి నాయకుడు లోకేష్ తెలుగు వింటేనే ఇబ్బంది అన్న సెటైర్లు కూడా ఉన్నాయి.


ఇంత దివ్యంగా తెలుగుదేశం పార్టీ పేరు వెలుగుతూంటే బాబు పని గట్టుకుని కర్నాటక‌కు పయనమై మరీ తెలుగు ఆడపడుచుని ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. అక్కడ మండ్య లోక్ సభకు అభ్యర్ధిగా మన తెలుగు మహిళామణి, సినీ నటి  సుమలత పోటీ చేస్తున్నారు. బాబు పని గట్టుకుని అక్కడకు వెళ్ళి మరీ తెలుగు మనిషిని ఓడించాలని పిలుపు ఇవ్వడం తెలుగు దేశం అధినాయకునికి తగునా అని సెటైర్లు పడుతున్నాయి.


సుమలత గుంటూరు జిల్లాకు చెందిన అచ్చ తెలుగు మహిళ. ఆవిడ కన్నడ నటుడు అంబరీష్ ని పెళ్ళి చేసుకుని అక్కడ స్థిరపడ్డారు. ఈ మధ్యన అంబరీష్ చనిపోవడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన సీటు నుంచి లోక్ సభకు సుమలత పోటీకి దిగారు. ఆమె ఇండిపెండెంట్ గా బరిలోకి  దిగి గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఇక ఇక్కడ కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. ఈ వారసుని గెలుపు కోసం బాబు గారు  కన్నడ నాట ప్రచారం చేస్తున్నారు. 


ఇది ఎంత వరకూ సమంజసం బాబూ అంటూ సోషల్ మీడియాలో ఓ లెక్కలో సెటైర్లు పడుతున్నాయి. బాబు మరీ ఇలా చేయడం ఏంటని అంతా అడుగుతున్నారు. అమెరికాలో కూడా మన తెలుగువాడు జెండా ఎగురవేయాలని చెప్పే బాబు కోరి మరీ కన్నడ నాట తెలుగు నటీమణిని ఓడించాలని ప్రచారం చేయడమేంటని కూడా గుస్సా అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: