ప్రస్తుతం కేసీఆర్‌కు తెలంగాణలో ఎదురేలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ అదే స్థితి కనిపిస్తోంది. కానీ మొత్తం 16 సీట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఓ ఐదు. చోట్ల మాత్రం కారు జోరుగా సాగలేదని టాక్ వస్తోంది. 


ఆ ఐదు సీట్లలో కారు పంక్చర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆ సీట్లు ఏమింటంటారా.. సికింద్రాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి. ఈ సీట్లలో టఫ్ పోటీ ఉందట. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే టిఆర్ఎస్ కు మిగిలిన పార్టీలకు మద్య పది శాతం తేడా ఉందని, అందువల్ల వాటిని గెలుచుకోగలమని టీఆర్‌ఎస్ చెబుతున్నారు.

సికింద్రాబాద్ లో బిజెపి నేత కిషన్ రెడ్డి, ఖమ్మంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, భువనగిరిలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండలో పిసిసి అద్యక్షుడు ఉత్తంక ఉమార్ రెడ్డి, మల్కాజ్‌ గిరిలో రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. వీటిలో సికింద్రబాద్ లో బీజేపీ, ఖమ్మంలో కాంగ్రెస్ గెలిచే పొజిషన్‌లో ఉన్నాయట. 

అదే నిజమైతే ఢిల్లీలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ కలలకు మరింత గండి పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్, ఆయన పార్టీ వైఖరిపై జనంలో అసంతృప్తి బయలు దేరిందని... అందుకే ప్రతిపక్షం వాయిస్ ఉండాలనే ఉద్దేశంతో జనం ఈ స్థానాల్లో కారుకు షాక్ ఇవ్వవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: