ఎన్నికల తర్వాత చంద్రబాబు తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి 120.. మరోసారి 130.. మరోసారి 150 ఇలా గెలుపు లెక్కలు చెబుతున్నారు. మరి ఆ స్థాయిలో విజయం సాధించినా సాధించకపోయినా.. చంద్రబాబు గెలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప విజేతగా నిలిచిపోతారు.


ఎందుకంటే... 80 శాతం ఓట్ల పోలింగ్ జరిగిన తర్వాత కూడా చంద్రబాబు బ్రహ్మాండంగా గెలిస్తే ఇక చంద్రబాబుకు తిరుగు ఉండదు. కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబుది కీలక పాత్ర అవుతుంది. ఎనభై శాతం పోలింగ్‌లో చంద్రబాబు ఇరవై వరకూ ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆయన హవాకు అడ్డు ఉండదు.

జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షనేత స్థాయిలో చక్రం తిప్పే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంటే.. ఇక చంద్రబాబు చెప్పిందే శాసనం.

సో.. చంద్రబాబు 80 శాతం పోలింగ్ జరిగిన తర్వాత కూడా గెలిస్తే.. అద్భుతమే అన్నమాట. కానీ మరి అలా జరిగే ఛాన్స్ ఉందా.. అంటే లేకపోలేదనే చెప్పాలి. ఇటీవలే తెలంగాణలో ఆ మేజిక్ జరిగింది. మరి కేసీఆర్ స్థాయిలో చంద్రబాబు కూడా సక్సస్ అందుకుంటారా.. అన్నది తేలాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: