సాంకేతిక పితామహుడు, కంప్యూటర్స్ ఫౌండర్, తెలుగు వారికి ఆంగ్లం నేర్పిన ఘనుడు, సంపద సృష్టికర్త, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పదేళ్ళు, ఇప్పుడు నవ్యాంద్ర కు ఐదేళ్ళ ముఖ్య మంత్రి-త్వం నెఱపిన అనుభవం కలుపుకొని, నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవమున్న ఏకైక భారత రాజకీయ దురంధరుడు (ఆయనే అంటుంటారు) నేడు "ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్లు - ఈవీఎం"ల పనితనంపై అనుమానం ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు రాష్ట్ర ఎన్నికల సంఘంపై కూడా అదే వరస.

Image result for evms vs chandrababu

ఇదంతా చూస్తే ఈవిఎంల లోపాలతోను, కాన్-ఫిగరేషన్లు మార్పులతోను, టాంపరింగుల తోను ఏపి అపద్ధర్మ ముఖ్యమంత్రి గాని, ఆయన పార్టీ గాని గెలుస్తూ, అధికారంలో కొనసాగుతున్నట్లు అంగీకరించినట్లేకదా! అలాగే ఆయన కొత్త మిత్రులు (పాత మిత్రుడు మోడి) మమత బెనెర్జీ, కుమారస్వామి గౌడ, ఎంకె స్టాలిన్ కరుణానిధి, పినరయి విజయన్, అఖిలేష్ యాదవ్, మాయావతి, లాలు ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రివాల్, రాహుల్ నెహృ గాంధి, ప్రియాంక నెహృ గాంధి వాధ్రా, వీరు, వీరి పూర్వీకులు (వారసత్వ రాజకీయాలు కదా) కూడా చంద్రబాబు లాగే ఇంతవరకు రాజకీయాధికారంలో కొనసాగినట్లు అంగీకరించినట్లే కదా!

Image result for chandrababu

అంటే నరేంద్రమోడీ బిజేపి, ఎన్డీఏతో బంధం తెంచుకొని రాగానే ఈవిఎంలలో చంద్రబాబుకు ఆయన మిత్రులకు అనుయాయులకు టాంపరింగులు కనిపిస్తూ ఉన్నాయా? ఇప్పుడు అలా ఐతేగతంలో వెలగబెట్టిన అధికారమంతా టాంపరింగులతోనేనా? ప్రజాభిమానంతో కాదా? ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదా? మోసం తోనే నిప్పు లాంటి చంద్రబాబు పరిపాలన కొనసాగించారా? గతంలో ఈ టాంపరింగ్ గుఱించి తెలిసినా తాను గెలుస్తున్నాడు కాబట్టి దానికి ప్రచారమివ్వలేదా? అందుకే ఆయన డిల్లీ యాత్రకు ఆయన మిత్రుల నుండి సైతం స్పందన కరువైంది. 

Image result for evms vs chandrababu

ఇప్పుడే అంటే చంద్రబాబుకు రాజకీయంగా పోగాలం దాపురించి నప్పుడే "ఈవీఎంల టామపరింగ్" అర్ధం చేసు కున్నారా! మరి మీ గతం సంగతేమిటి? మరి మోడీ-పవన్ లతో మైత్రి నెఱపి మీరు 2014 ఎన్నికల్లో ఇదే ఎన్నికల సంఘం గాని ఈవీఎంలు గాని ఆదర్శవంతంగా పనిచేశాయా? ఎప్పుడైతే చంద్ర బాబు ఆయన దేశ వ్యాప్త మిత్రు లంతా ఓటమి తప్పదని గ్రహించినప్పుడే "ఈ వీ ఎం లు అన్ని లోపాల పాపాల పుట్టలయ్యాయా?" ముందు ఈవీఎం లు ప్రవేశ పెట్టింది బిజెపి ఎన్ డీఏ నరేంద్ర మోడీ కాదు గదా! చంద్రబాబుకు తన తెలుగు ప్రజల ఆత్మా భిమానాన్ని ఎవ్ అరి పాదాల చెంతైతే పెట్టాడో వారి అంటే "సోనియా-రాహుల్" ఆద్వర్యంలోనే కదా సిబిఎన్ కు అత్యంత ప్రీతిపాత్రమైన సాంకేతికతతో కూడిన ఈ ఎన్నికల విధానం అమలులోకి వచ్చింది కదా!

Image result for chandrababu

అదే ఎన్నికల విధానంలో మూడుసార్లు అధికారం చలాయించి రాష్ట్రాన్ని ముక్కలు చేసి నేడు అధికారం పోయే వేళలో తన గత విజయాలలోని పాపం గుర్తొచ్చిందా? ఆ పాపాన్ని అనుభవించే ట్రేడ్ రైట్స్ తన స్వంతమా? వేరే వాళ్ళు ఆ ప్రయోజనం (ఒక వేళ ఈవీఎంల టాంపరింగ్ ఉంటే) పొందకూడదా? ఆ పాపంలోని ప్రయోజనం మొత్తం మీకే సమర్పణం కావాలా?  కనీసం లెట్ అథర్స్ ఎంజోయ్ ద పవర్! 

Image result for evms vs chandrababu

90000 ల ఈవీఎం లలో 45 ఈవిఎం లలో అంటే 0.05 శాతం సంఖ్యలో వచ్చిన సమస్యను తీవ్ర సమస్యగా గుర్తిద్ధామా? సాంకేతికత లోపాలు సవరిస్తూ ముందుకు సాగాలి గాని ఆ సాంకేతికతనే నిర్మూలిద్ధాం అనే చంద్రబాబు తీరు గర్హనీయం. క్షమించరానిది కూడా! పదిహేనేళ్లు సాంకేతికత ఆధారంగా జరిగిన ఎన్నికలలో ఎన్నికై అధికారం సకుటుంబ, సపరివార, స-స్వసామాజిక వర్గ సమేతంగా అనుభవించి నేడు తనకు, తన సామాజిక వర్గ ప్రయోజనా లకు అధికారంలో గడ్డుకాలం ప్రాప్తించగా తన తన జాతి సమస్యను జాతీయ సమస్యగా చంద్రబాబు చేస్తుంటే దాన్ని వేలరెట్లు విస్తృత పరుస్తూ వార్తా ప్రసారం చెసే స్వసామాజిక వర్గ మీడియాను సైతం క్షమించ కూడదు. జాతికి ఒక అశుద్ధ అవినీతి రాజకీయ నాయకుడు చెసే కీడు కంటే దాన్ని వికృతంగా విస్తృతంగా ప్రచారం చెసే కీడే ప్రమాదం.

Image result for chandrababu
సాంకేతికత లోపాలు సవరించుకుంటూ ముందుకు సాగాలే తప్ప అసలు సాంకేతికతనే నిర్మూలించాలని అనుకోవటం సాంకేతిక పితామహునికి భావ్యమా! ఇక దేశ పర్యటనలు మానుకొని రాష్ట్రపాలన వైపు అపద్ధర్మంగా నైనా దృష్టి సారించండి మహా ప్రభో! అంటున్నారు తెలుగు వాళ్ళు. 

Image result for chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: