ఎంత గజీతగాడైనా ఒక్కోసారి మురికాలువలో పడతారనటానికి చంద్రబాబునాయుడే తాజా ఉదాహరణ. 40 ఇయర్స్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకుంటారు. దేశంలోని తనంతటి సీనియర్ రాజకీయ నేత లేరని తన భుజాన్ని తానే చరుచుకుంటుంటారు. అలాంటిది పోలింగ్ జరిగన దగ్గర నుండి టిడిపి ఓడిపోతోందనే ప్రచారానికి తానే కారణమని ఆలస్యంగా గుర్తించినట్లున్నారు. అందుకనే ఇపుడు డ్యామేజి కంట్రోలుకు దిగారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, పోలింగ్ రోజున కొన్ని ఈవిఎంలు మొరాయించిన మాట వాస్తవం. దాంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ బాగా ఆలస్యమైంది. దాన్ని సాకుగా తీసుకుని పాత డిమాండ్ ను చంద్రబాబు మళ్ళీ మొదలుపెట్టారు. ఈవిఎంలకు బదులుగా ఓటింగ్ ను పేపర్ బ్యాలెట్ పద్దతి ప్రవేశపెట్టాలన్న తన డిమాండ్ పై గోల మొదలుపెట్టారు.

 

మొత్తం 46, 500 పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు మొరాయించింది కేవలం 265 కేంద్రాల్లోనే. అయితే చంద్రబాబు మాత్రం 30 శాతం పోలింగ్ కేంద్రాలంటూ తప్పుడు లెక్కలను ప్రచారంలోకి తెచ్చారు. చంద్రబాబు చెప్పిందే నిజమైతే మరి రికార్డు స్ధాయిలో 80 శాతం పోలింగ్ ఎలా జరిగింది ? సరే ఈవిఎంల అంశాన్ని పక్కనపెడితే చంద్రబాబు గగ్గోలుతో టిడిపి ఓటమి తప్పదన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈవిఎంలను సాకుగా చూపుతున్నారనే ప్రచారం ఊపందుకున్నది.

 

చంద్రబాబు వైఖరి వల్ల సీనియర్ నేతలు కూడా టిడిపి గెలుస్తుందని గట్టిగా చెప్పలేకపోయారు. అదే విషయాన్ని పార్టీ నేతల సమావేశంలో కొందరు చంద్రబాబుకు వివరించారట. దాంతో వాస్తవాన్ని గ్రహించిన చంద్రబాబు వెంటనే డ్యామేజి కంట్రోలుకు దిగారు. టిడిపికి 150 సీట్లు వస్తుందని మొదలుపెట్టారు. టిడిపి ఓడిపోయే ప్రసక్తే లేదని, ఓడిపోయేందుకు అవకాశమే లేదనే కాకిలెక్కలను కూడా మొదలుపెట్టారు.

 

చంద్రబాబు చెప్పినట్లుగా 150 సీట్ల సంగతి దేవుడెరుగు టిడిపికి ఓటమి తప్పదని నేతలందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే, పోలింగ్ రోజు మొదలైన చంద్రబాబు రచ్చ పార్టీ ఇమేజిని అంతగా దెబ్బకొట్టేసింది. నిజానికి ఓటరు తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమైన తర్వాత చంద్రబాబు ఈవిఎంల గురించి మాట్లాడకూడదు. గెలుస్తామని వైసిపి నేతలు ఎలా చెబుతున్నారో అంతే అవకాశం టిడిపికి కూడా ఉంది. ఆ విషయాన్ని వదిలిపెట్టి ఈవిఎంలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎప్పుడైతే గోల మొదలుపెట్టారో అప్పుడే టిడిపి ఓటమి ఖాయమని అందరూ ఫిక్సయిపోయారు. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: