అవుననే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో కోడెల శివప్రసాద్ రావు చేసిన డ్రామా అంతా అందరికీ తెలిసిందే.  పోలింగ్ రోజు నుండి ఇప్పటి వరకు జరుగుతున్న టిడిపి దాడులపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ ను జగన్ కలిశారు. గవర్నర్ కు వివరించిన అనేక అంశాల్లో కోడెల శివప్రసాదరావు డ్రామా కూడా ఒకటి.

 

తర్వాత మీడియాతో మాట్లాడుతూ కోడెల అంశాన్ని మళ్ళీ ప్రస్తావించారు. పోలింగ్ కేంద్రంలోకి అసలు అభ్యర్ధి వెళ్ళనే కూడదని చెప్పారు. కానీ నిబంధనలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన కోడెల తలుపులు వేసేసుకోవటమేంటని నిలదీశారు.  దాదాపు గంటపాటు పోలింగ్ కేంద్రంలోనే గడిపిన కోడెల తర్వాత తన చొక్కాను తానే చింపేసుకుని తనపై వైసిపి వాళ్ళు దాడులు చేశారనే డ్రామా మొదలుపెట్టినట్లు ఎద్దేవా చేశారు.

 

కోడెల తన చొక్కాను తానే ఎందుకు చింపుకున్నారు ? అంటూ జగన్ నిలదీశారు. ఓట్లన్నీ తనకు వ్యతిరేకంగా పడుతున్నాయన్న కోపంతో తనపై దాడి జరిగినట్లు డ్రామాలడటానికే తన చొక్కాను తానే చింపేసుకున్నాడన్నారు. కోడెలపై దాడి జరిగింది లేదు, చొక్కాను ఇంకెవరో చింపింది లేదు అంటూ జగన్ ఎద్దేవా చేశారు.

 

చొక్కా చింపేసిన డ్రామాలో తమ పార్టీకి చెందిన వారిపై తప్పుడు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించినట్లు జగన్ మండిపడ్డారు.  పోలింగ్ సందర్భంగా అసలా ఊళ్ళోనే లేని తమ నేతలపైన కూడా కోడెల కావాలని ఫిర్యాదు చేసి కేసులు బనాయించినట్లు ఆరోపించారు. కోడెలపై జగన్ చేసిన ఆరోపణలు కాస్త లాజికల్ గానే ఉన్నట్లున్నాయి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: