అదే హుందాతనం వైఎస్ ఫ్యామిలీకి వారసత్వంగా వచ్చిందనుకోవాలి. నాడు వైఎస్సార్ కూడా అన్నిటికీ అతీతంగా వ్యవహరించారు. ఆయనలో ఉన్న నిండుతనం, స్థితప్రగ్నత జగన్ కూడా అంది పుచ్చుకున్నాడనుకోవాలి. రాజకీయంగా జగన్ పరిపక్వత సాధించారు. అందుకే ఆయన విలువైన ప్రకటనలే చేస్తున్నారు. ఇపుడు ఏపీకి ఇలాంటి నాయకత్వమే కావాలనిపిస్తున్నారు.


గవర్నర్ కి వినతిపత్రం ఇచ్చిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ లో  మీడియాతో మాట్లాడుతు జగన్ చేసిన కామెంట్స్ చంద్రబాబు బేలతనాన్ని బాగా ఎండగట్టాయి. పోలింగ్ ముందు నుంచి బాబు పడుతున్న వీరావేశం, ఆయన ప్రకటనలు ఇవన్నీ కూడా జగన్ గట్టిగానే విమర్శించారు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు బాబూ అంటూ నిలదీశారు. ఓడిపోతానని భయమా. అందుకేనా నానా యాగీ చేస్తున్నావంటూ జగన్ విరుచుకుపడ్డారు.

ఓటేసి వచ్చాక చిరునవ్వులు చిందించిన బాబు ఆ తరువాత మాత్రమే పెడ బొబ్బలు పెట్టిన సంగతిని జగన్ గుర్తు చేశారు. తాను ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అది సైకిల్ కి పడితే చూస్తూ వూరుకుంటానా అంటూ బాబు చేతగానితనాన్ని కూడా ఎద్దేవా చేశారు. మొత్తానికి మొత్తం ఓటర్లు  ప్రశాంతంగా ఓటేసి వెళ్ళిపోతే ఒక్క చంద్రబాబు మాత్రమే అరచి గీ పెట్టారని, బాగా జరిగిన పోలింగ్ విషయంలో బాబు జనాని తప్పు తోవ పట్టించారని జగన్ అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని  జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేయడమే కాకుండా దొంగకేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. స్పీకర్‌ కోడేల శివప్రసాద్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నా పోలీసులు ఆయనపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఓడిపోతాననే భయంతో చంద్రబాబు నాయుడు ప్రజల తీర్పును అవహేళన చేస్తు మాట్లాడుతున్నారని ఆరోపించారు.మొత్తానికి నాలుగు రోజుల పాటు బాబు చేసిన హడావుడికి ఒక్క ప్రెస్ మీట్ తో జగన్ జబర్దస్త్ సమాధానమే చెప్పారనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: