అపుడెపుడో పురాణాల్లో శిశుపాలుడు నూరు తప్పులు చేసాడని కధనం ఉంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ కూడా అన్నేసి తప్పులు చేయడం వల్లే సెకెండ్ టర్మ్ పవర్లోకి రావడం డౌట్లో పడిందంటోంది ఓ ఆంగ్ల కధనం. ఇంటెరెస్టింగ్ గా మాత్రమే కాకుండా లాజిక్ ఎక్కడా మిస్ కాకుండా వచ్చిన ఈ కధనం ఓ విధంగా టీడీపీ ఫ్యూచర్ ని ముందే చెప్పేసినట్లుగా ఉంది.


బాబుకు ఈ ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడబోతోందని ది ఎకనామిక్స్ టైమ్స్  పత్రిక రాసిన కధనం ఇపుడు సెన్సేషన్ అవుతోంది. ఈ కధనం ప్రకారం చంద్రబాబు సర్కార్ అయిదేళ్ల పాలనలో చేసిన తప్పులకు ఫలితమే ఆ పార్టీ ఘోరమైన  పరాజయ  బాట పట్టబోతోందని చెప్పుకొచ్చింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన అనుభవం ఎక్కడ ఉపయోగించాలో అక్కడ వాడలేదని అంటోంది. అమరావతి గ్రాఫిక్స్ రోత పుట్టిస్తే పోలవరం అవినీతి కధలు మరో రకంగా జనానికి మంట పుట్టించాయని ఆ కధనంలో రాశారు.


ఇక ఏపీలో కట్టలు తెచ్చుకున్న అవినీతి ఈ ఎన్నికల్లో సైకిల్ పక్చర్లకు  ప్రధాన కారణమని వెల్లడించింది. జన్మ భూమి కమిటీలు పల్లెల్లో టీడీపీని ఉరి తీశాయని కూడా పేర్కొంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి కధలు ఎంత చెప్పినా తక్కువేనని కూడా పేర్కొంది. ప్రత్యేక హోదా విషయంలో బాబు వేసిన పిల్లి మొగ్గలు కూడా ఏపీ జనానికి వెగటు పుట్టించాయట. అలాగే నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసి చివర్లో దారుణంగా నిందించడం కూడా నచ్చలేదని అంటున్నారు. 


ప్రధాని అన్న కనీస గౌరవం ఇవ్వకుండా మోడీని వ్యక్తిగతంగా తిట్టడం, ఏపీలో లేని కేసీయార్ని ఇష్టం వచ్చినట్లుగా బాబు ఎన్నికల వేళ తిట్టడం బూమరాంగ్ ఐందని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ చివరికి అదే పార్టీతో తెలంగాణాతో పొత్తు పెట్టుకోవడం కూడా జనాగ్రహానికి కారణమని పేర్కొంది.  మోదీని వదిలేశారు, సరే రాహుల్ తో రాసుకుపూసుకు తిరగడం కూడా జనానికి బొత్తిగా డైజెస్ట్ కాలేదని పేర్కొంది.
మొత్తానికి  బాబు ప్రచారమే ఈసారి అసలు బాగులేదని కూడా తేల్చేసింది.  ఇక  కుమారుడు లోకెష్, బావమరిది బాలక్రిష్ణ యాక్షన్  పార్ట్, వారి మార్క్ కామెడీ కూడా ఈ ఎన్నికల్లో టీడీపీకి యాంటీ అయ్యాయని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు మళ్ళీ  గెలవడానికి కారణాలు పెద్దగా లేకపోగా, ఓడిపోవడానికి మాత్రం వందకు వంద కారణాలు అయితే ఉన్నాయని ఆ ఆంగ్ల కధనం తేల్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: