దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల నిర్వాహణకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. 12 రాష్ట్రాల పరిధిలోని 96 లోక్‌సభ స్ధానాలు 53 శాసనసభ స్ధానాలకు కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. భారీ ఎత్తున నగదు పట్టుబడటంతో తమిళనాడులోని వేలూరు స్థానానికి పోలింగ్ ను ఎన్నికల సంఘం నిలిపివేసింది. రేపటి పోలింగ్ లో మొత్తం 15,79,34,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 


తమిళనాడులో వెల్లూరు మినహా మిగిలిన 38 స్ధానాలతో పాటు, దినకరన్ వర్గంగా గుర్తింపు పొంది అనర్హత వేటుకు గురైన 18 మంది శాసనసభ్యుల నియోజకవర్గాల్లో రేపు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు ఏకైక లోక్ సభ స్ధానం ఉన్న పాండిచ్చేరిలోనూ గురువారమే ఎన్నికలు జరగనున్నా యి. 1629 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒడిసాలో 35 శాసనసభ స్ధానాలకు కూడా ఎన్నికలు ఏక కాలంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్లో మూడు స్ధానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి.


ఇక జమ్ముకశ్మీర్‌లో రెండు స్ధానాలకు, మణిపూర్‌, త్రిపురల్లో ఒక్కో స్ధానానికి పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిళనాడుతో పాటు కర్నాటకలోని 14 లోక్‌సభ స్ధానాలకు, మహారాష్ట్ర 10 స్ధానాల్లో, ఉత్తర ప్రదేశ్‌లోని 8 చోట్ల ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటితో పాటు అస్సోం, బీహార్‌, ఒడిసాలో ఐదేసి స్ధానాల చొప్పున పోలింగ్ జరగనుంది. ఒడిసాలో 35 శాసనసభ స్ధానాలకు కూడా ఎన్నికలు ఏక కాలంలో నిర్వహిస్తున్నారు.   


ఉత్తరప్రదేశ్:

  • హేమమాలిని - బీజేపీ (మథుర)
  • రాజ్ బబ్బర్ - కాంగ్రెస్ (ఫతేపూర్ సిక్రీ)
బీహార్:
  • తారిఖ్ అన్వర్ - కాంగ్రెస్ (కతిహార్)
తమిళనాడు:
  • కనిమొళి - డీఎంకే (తూత్తుకుడి)
  • తమిళిసై సౌందర్రాజన్ - బీజేపీ (తూత్తుకుడి)
  • పొన్ రాధాక్రిష్ణన్ - బీజేపీ (కన్యాకుమారి)
  • ఏ రాజా - డీఎంకే (నీలగిరి)
  • కార్తీ చిదంబరం - కాంగ్రెస్ (శివగంగ)
కర్ణాటక:
  • దేవెగౌడ - జేడీఎస్ (తుముకూరు)
  • సుమలత - ఇండిపెండెంట్ (మాండ్య)
  • నిఖిల్ కుమారస్వామి - జేడీఎస్ (మాండ్య)
  • ప్రకాశ్ రాజ్ - ఇండిపెండెంట్ (బెంగళూరు సెంట్రల్)
మహారాష్ట్ర:
  • ప్రకాశ్ అంబేద్కర్ - వంచిత్ బహుజన్ అఘాడీ (అకోలా)
జమ్ముకశ్మీర్:
  • ఫరూక్ అబ్దుల్లా - నేషనల్ కాన్ఫరెన్స్ (శ్రీనగర్)
  • జితేంద్ర సింగ్ - బీజేపీ (ఉధంపూర్). 

మరింత సమాచారం తెలుసుకోండి: