ఎన్నికల నిర్వహణపై రోజు రోజుకు గందరగోళం పెరిగిపోతోంది. నిజానికి ఇంతటి గందరగోళం గతంలో ఏ ఎన్నికల విషయంలో కూడా తలెత్తలేదు. మరి ఇప్పుడే ఎందుకు తలెత్తింది ? ఎందుకంటే, చంద్రబాబునాయుడు వ్యవహారశైలే ప్రధాన కారణమని చెప్పాలి.  ఎలాగైనా సరే  అధికారంలోకి రావాలన్న పట్టుదలతో పాటు సర్వ వ్యవస్ధలను భ్రష్టుపట్టించటమే. జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో పాటు సకల ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

 

ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంబంధం లేని ఆశావర్కర్లు, సేవామిత్ర తదితర వ్యవస్ధలను ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగించుకున్నారు. అదే సమయంలో అత్యధికంగా ఈవిఎంలు మొరాయించటం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈవిఎంలు మొరాయించినపుడు రిపేర్లు చేయించటానికి భెల్ నుండి నిపుణులను రప్పించినా కలెకర్టు వాళ్ళ సేవలను ఉపయోగించుకోకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

 

అలాగే ఈవిఎంలు ఎక్కువగా మొరాయించింది కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే.  ఈవిఎంలు మొరాయించాయన్న పేరుతో కొన్ని చోట్ల ఆరుచోట్ల మార్చారు. ఇలా ఈవిఎంలు మార్చటంపై హ్యాకింగ్, ట్యాంపరింగ్ జరిగాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్. నిజానికి అవసరం లేకపోయినా మైలవరం నియోజకవర్గంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అలాగే, నూజివీడు నియోజకవర్గంలో ఉపయోగించని ఈవిఎంలను స్ట్రాంగ్ రూములనుండి మార్చారు. నిజానికి ఈవిఎంలను మార్చాలంటే ఎన్నికల కమీషనర్ అనుమతి తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ తీసుకోలేదు.

 

ఇక పెనమలూరు నియోజకవర్గంలో ఈవిఎంలను స్ట్రాంగ్ రూములకు చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు. అందుకు కారణాలను చెప్పమంటే సిబ్బంది చెప్పలేకపోతున్నారు. మొత్తం వ్యవహారాలను గమినించిన తర్వాత కలెక్టర్ల పాత్రలపైన కూడా ఎన్నికల కమీషన్ కు అనుమానాలు మొదలైనట్లుంది. అందుకే పోలింగ్ ఆలస్యంగా  జరగటానికి కారణాలను వివరిస్తూ నివేదిలను ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. కొన్ని చోట్ల మైనర్లు కూడా ఓట్లేశారట. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో వివిధ స్ధాయిల్లోని 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమీషన్ చీఫ్ ఎలక్షన్  కమీషన్ కు సిఫారసు చేశారు.

 

ఐటి సలహాదారు పేరుతో హరిప్రసాద్ ను జిల్లాల కలెక్టర్లకు చంద్రబాబు బలవంతంగా రుద్దారు. ఈ హరిప్రసాద్ గతంలో ఈవిఎం చోరి చేసిన కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఈయన ఈవిఎంలను ట్యాంపరింగ్, హ్యాకింగ్ చేయటంలో నిపుణుడు. ఈయన్ను అడ్డం పెట్టుకుని సకల వ్యవస్ధలను ఆయన గుప్పిట్లోకి తెచ్చి ఈవిఎంలను ట్యాంపరింగ్, హ్యాకింగ్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నించినట్లు వైసిపి అనుమానం వ్యక్తం చేస్తోంది. దానికితోడు క్షేత్రస్ధాయిలో జరిగిన పరిణామాలు కూడా అనుమానాలకు ఊతమిస్తున్నాయి. అందుకనే జరిగిన ఎన్నికల తీరుపై రోజురోజుక అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చీఫ్ ఎలక్షన్ కమీషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: