ఏపీ సీఎం చంద్ర‌బాబుపై స‌టైర్లు పేలుతున్నాయి. ఆయ‌న వ్య‌వ‌హార శైలి, మాట‌ల‌ను కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు మె చ్చుకున్న మేధావి వ‌ర్గం కూడా ఇప్పుడు పెద‌వి విరుస్తూ. ప‌ళ్లు కొరుకుతున్నారు. ఓట‌మి అంచ‌కు చేరిన వీర సైనికుడిగా చంద్ర‌బాబు ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నార‌ని అంటున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌ను మించిన మొన‌గాడు లేడ‌నే చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తున్న కామెంట్లు కుళ్లు జోకుల్లా పేలుతున్నాయ‌ని మేధావులే సెల‌విస్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. టెక్నాల‌జీని ఈ దేశంలో ముందు వాడింది తానేన‌ని చెప్పే చంద్ర‌బాబు ఇప్పుడు అదే టెక్నాల‌జీపై యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు. ముఖ్యంగా ఎన్నిక‌ల సంఘంపై ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌లు జోకులుగా మారుతున్నాయి. 


ఈవీఎంల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డాన్ని స్వాగ‌తించిన చంద్ర‌బాబుకు.. ఇప్పుడు అవే ఈవీఎంలు భ‌య‌పెడుతున్నా యి.. ఓట‌మి త‌ప్ప‌దా? అనే బాధ‌ను కూడా పెడుతున్నాయి. దీంతో ఏకంగా దేశంలో మ‌ళ్లీ పాత రోజులు కావాల‌ని, రావాల‌ని గ‌ట్టిగా గంటాప‌థంగా కోరుతున్నారు. ఈవీఎంల‌ను గుండుగుత్తుగా ఎత్తేసి.. బ్యాలెట్‌కు వెళ్లాల‌ని సెల‌విస్తున్నారు. అయితే, ఈవీఎంల‌ను స‌మ‌ర్ధించిన నాయ‌కుల్లో ముందున్న చంద్ర‌బాబు.. అదేస‌మ‌యంలో 2014లో ఇదే ఈవీఎలంతో గెలిచిన చంద్ర‌బాబు ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డంపై అంద‌రికీ వ‌స్తున్న అనుమానం ఒక్క‌టే.. ఆయ‌న ఓట‌మికి చేరువ‌య్యారా? అనేదే. ఇదెలా ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారం, ప్ర‌క‌ట‌న‌లు కూడా వ్యంగ్యాస్త్రాలుగా మారిపోయాయి. 


చంద్ర‌బాబు క‌న్నా సీనియ‌ర్లు రాజ‌కీయాల్లో లేక పోవ‌చ్చు.. కానీ, ఆయ‌న‌క‌న్నా ఎక్క‌వుగా చ‌దివిన నాయ‌కులు ఉన్నారు. ఐఐటీ వంటి ప్ర‌సిద్ధ చ‌ద‌వులు చ‌ద‌విన వారు కూడా ఉన్నారు. దీంతో వారికి కూడా రాని సందేహం చంద్ర‌బాబుకే వ‌చ్చింది. ఇక‌, తొలి విడ‌త పోలింగ్ ఒక్క ఏపీలోనే జ‌ర‌గ‌లేదు. తెలంగాణ‌లోనూ జ‌రిగింది. కానీ, అక్క‌డ ఏ ఒక్క‌రూ కూడా బాబు మాదిరిగా అరిచి గీపెట్టిన నాయ‌కులు క‌నిపించ‌లేదు. ఇక‌, రాష్ట్రంలో తాను మాత్ర‌మే అభివృద్ధికి కేరాఫ్ అని చెప్పుకోవ‌డంపై నా స‌టైర్లు పేలుతున్నాయి. చంద్ర‌బాబు ఉంటేనే అభివృద్ధి అంటే.. మిగిలిన సీఎంలు ఏమీ చేయ‌లేదా? అనే ప్ర‌శ్న వెంట‌నే తెర‌మీదికి వ‌స్తోంది. ఏదేమైనా చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి, ఆయ‌న మాట‌లు అచ్చు పిట్ట‌ల దొర‌ను గుర్తుకు తెస్తున్నాయ‌ని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: