ఆయన ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. జాతీయ నాయకుడు కూడా. సీనియర్ మోస్ట్ అని తనకు తానే చెప్పుకుంటారు. ఎన్నో ఎన్నికలు చూసి ఆరితేరిన యోధుడు అటువంటి చంద్రబాబు ఈసారి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కప్పదాట్లు, తడబాట్లు, పొరపాట్లు ఎన్నో చేస్తున్నారు. వరసగా ఆయన కోడ్ ఉల్లంఘన చేస్తూనే ఉన్నారు. 


పోలింగ్ ముందు రోజు ఏకంగా ఈసీ ఆఫీస్ ఎదుట  సీఎం హోదాలో ధర్నా నిర్వహించి రికార్డ్ నెలకొల్పారు. ఆ తరువాత పోలింగ్ రోజు అభివ్రుద్ధి చేసిన పార్టీకే ఓటు వేయాలంటూ  ఓటర్లకు పిలుపు ఇచ్చి మళ్ళీ కోడ్ పక్కన పెట్టారు. అదే రోజు రెండు గంటలు కూడా పోలింగ్ కాలేదు, రీపోలింగ్ కోసం డిమాండ్ చేసి హడావుడి చేశారు. ఇక బాధ్యత గల పదవిలో ఉండి ఈవీఎంల మీద డౌట్లు మీద డౌట్లు పెట్టి ఎండలతో పాటు  రోజంతా క్యూ లైన్లలో ఉన్న వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీశారు.


ఇక ఏకంగా ఈసీకే రాజకీయం అంటగడుతూ చేసిన ప్రకటలు బోలెడు, ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సాక్థాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద కోవర్ట్ అంటూ హాట్ కామెంట్స్ చేసి సరికొత్త కల్చర్ నెలకొల్పారు. ఈసీ ద్వివేదీని బెదిరిస్తూ మాట్లాడ‌డం మరో ఎపిసోడ్. ఇవన్నీ ఇలా ఉంటే నిన్న సమీక్షల పేరిట తెర తీసి కోడ్ ని మరో మారు పక్కన పెట్టారు. ఇవాళ అమరావతి సచివాలయం లో సమీక్ష‌లంటూ అధికారులను పిలిచి మరీ కోడూ లేదూ గీడూ లేదు అనేశారు.


అయితే తాను ఎవరైతే కోవర్ట్, సహ నిందితుడు అంటూ హాట్ కామెంట్స్ చేసారో అదే సీఎస్ ఎల్వీ సుబ్రహమణ్యం మాత్రం చక్కగా కోడ్ పాటించి తన నిబద్ధత‌ను చాటుకున్నారు. కోడ్ విషయం గుర్తు చేసినా పట్టించుకోని సీఎం ఓ వైపు, కోడ్ పాటిస్తూ ఉన్న సీఎస్  మరో వైపు, మరి కోవర్ట్ అన్న పదం ఆయన మీద వాడొచ్చా. వ్యవస్థలు, నియమాలు ఎవరు మంటగలుపుతున్నారిపుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: