వైఎస్. జగన్.. ఏపీ ప్రతిపక్షనేత.. భారత దేశంలో  సీఎం కుర్చీ నా ఆశయం అని చెప్పుకొని మరీ దాని కోసం పోరాడిన ఒకే ఒక్క నాయకుడు.. అంతే కాదు.. ఒక్కసారి సీఎం అయితే 30 ఏళ్లు పాలిస్తానని మరీ చెప్పిన ఏకైక నాయకుడు. 


ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో తన పార్టీని విజయతీరాలవైపు నడిపించాడు. నూటికి తొంభైశాతం కాబోయే సీఎం జగనే అన్న వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. మరి అలాంటి జగన్‌ కు అండగా నిలిచిందెవరు.. జగన్ కు అన్నివేళలా సాయపడుతున్నదెవరు..? 

ఓ నలుగురు మాత్రం జగన్ కు కళ్లూ ముక్కూ చెవులుగా పనిచేస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి జీవీడీ కృష్ణమోహన్. ఈయన జగన్ మీడియా వ్యవహారాలు చూస్తుంటారు. పత్రికల విశ్లేషణ.. జగన్ ఏ అంశాలు ప్రస్తావించాలనే అంశాల పరిశీలన అంతా ఈయన పర్యవేక్షణలోనే 

రెండో వ్యక్తి.. తలశిల రఘురామ్- జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఈయన.. జగన్ యాత్రల స్క్రీన్ ప్లే అంతా ఆయనే చూసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర, ఆ తర్వాత షర్మిళ,  విజయమ్మల యాత్రలను కూడా ఈయనే పర్యవేక్షించారు. జగన్ పాదయాత్రలు ఇంతగా సక్సస్ కావడంలో ఈయని కీలకపాత్ర. 

ఇక మూడో వ్యక్తి.. కేఎన్నార్‌. ఈయన జగన్ వ్యక్తిగత సిబ్బంది. జగన్ కు సంబంధించిన ప్రతి చిన్న వ్యవహారమూ ఆయన చూసుకుంటారు. ఇక నాలుగో వ్యక్తి ట్రంప్ అవినాశ్‌.. ఆ మధ్య అమెరికా ఎన్నికల్లో ట్రంప్ వ్యవహారాలు చూసుకున్నదిఈయనే. ఈయన జగన్ ఎన్నికల వ్యూహకర్త కూడా అని వార్తలు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: