ప్రియాంక నెహృ గాంధి వాద్రాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయించే విషయంలో రాహుల్ గాంధీ ఆలోచన ఎవరికీ అంతుపట్టట్లేదు. ఏఎ విషయంలో రాహుల్ గాంధీ తీరు కాంగ్రెస్ పార్టీలోనే ఆందోళనకరమైన అంశంగా, చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగతంగా ఈ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక అంగీకరించారు. ఆమె వారణాసి నుంచి మోడీ మీద పోటీకి సై అంటే సై అంటున్నారు.

ఆమె మాట ప్రకారం ప్రియాంకను మోడీ మీద పోటీ చేయనిస్తారా? అని అంటే మాత్రం సమాధానం రాహుల్ గాంధి నుంచి రావాలని ఆయన ఇంకా నిర్ణయించలేదని అంటున్నారు. ఆ అంశం పై “సస్పెన్స్” ను కొనసాగిస్తున్నారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధి ఇలాంటి ప్రవర్తనతో పార్టీని దెబ్బతీస్తాడా? అనే దానిపై పెద్ద చర్చే జరుగుతుంది. 
Image result for priyanka gandhi vs narendra modi
రాహుల్ సమస్య ఏమంటే ప్రియాంకను ప్రధాని నరేంద్ర మోడీ మీద పోటీకి నిలబెట్టట మంటే అది అటో ఇటో తేల్చుకోవడానికి సిద్దమవటమే. దేశంలోని అన్నీ జాతీయ ప్రాంతీయ పార్టీలలో నరేంద్ర మోడీకి సమ ఉజ్జీ - ధీటైన సత్తా ఉన్న నాయకులు ఒక్కరు కూడా లేరన్న తరుణంలో - ఒక్కసారే అదీ తొలి ప్రయత్నంలోనే ప్రియాంక, మోడీ లాంటి నాయకుణ్ణి ఢీకొట్టటమంటే ఏనుగు కుంభస్థలాన్ని ఢీ కొనటమే అవుతుంది. 

మోదీ పై ప్రియాంక ప్రయోగంతో కాంగ్రెస్ కు రెండు రకాల పరిస్థితులు ఎదురుకావొచ్చు.

ప్రియాంక వారణాసిలో మోడీ మీద విజయం సాధిస్తే: మొదట అంతకన్నా  సంచలనం ఉండదు. ఎంతైనా ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీని - అది కూడా యూపీలో వారణాసిలో ఓడించడం అంటే అంత తేలికైన విషయం కాదు మాటలు చెప్పినంత సులభమూ కాదు. ఉన్నట్టుండి వెళ్లి ప్రియాంక అక్కడ నామినేషన్ వేస్తే గెలిస్తుందా అనేది నూరు శాతం సందేహమే.


తొలి ప్రయత్నమే నరేంద్ర మోడీ మీద కదా! ఓడిపోయినా ఫర్వాలేదు అనుకోవచ్చు. కాని  ఆమె ప్రియాంక గాంధి ఇందిర రూపాన్ని పుణికి పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ట్రంప్ కార్డ్. కాంగ్రెస్ చేతిలో బ్రహ్మాస్త్రం. ఇలంటి తరుణంలో ఆమె గనుక నరేంద్ర మోడీ చేతిలో ఓడిపోతే “బీజేపీ” కాంగ్రెస్ పార్టీని ఒక రేంజ్ లో ఆడేసుకుంటుంది. కాంగ్రెస్ దేశ ప్రజల దృష్టిలో రాహుల్ గాంధి లాగా మరింత చులకన అయ్యే అవకాశాలున్నాయి.
Image result for priyanka gandhi vs narendra modi
ఇప్పటికే హుందాతనం లేని, ఏమాత్రం ప్రదర్శించని, రాహుల్ గాంధితో బీజేపీ ఒక ఆట ఆడేసుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రియాంక వాధ్రా రావడం – తొలిసారే నరేంద్ర మోడీ మీద పోటీ చేసి ఓడిపోతే, అది ఆమె రాజకీయ జీవితానికి చరమ గీతం పాడటం మాత్రమే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీకే అతి పెద్ద డ్యామేజ్ ఆపై ధారుణ పరాభవానికి గుఱయ్యే అవకాశాలున్నాయి. 


ఈ సారి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయమేమంత తేలిక కాదు. గత ఎన్నికలతో కంటే కొంత మెరుగుపడ్డా అదేమంత ఎన్నికలలో గెలుపుపై ప్రభావం చూపేది కాదన్నది ప్రస్తుత పరిస్థితి.  ఇలాంటి  తరుణంలో బ్రహ్మాస్త్రాన్ని పరిణితి లేని తరుణంలో ప్రయోగించేస్తే, నిష్ఫలమే కాకుండా, ఫలితాలు వేరేలా వస్తే కాంగ్రెస్ తో పాటు నెహృ గాంధి కుటుంబానికి రాజకీయంగా కోలుకోవడానికి కూడా అవకాశం ఉండదని కాంగ్రెస్ సీనియర్ల భావన.
Image result for priyanka gandhi vs narendra modi
అందుకే  ప్రియాంకను పోటీ చేయించక పోవడమే ఉత్తమ మనేది కాంగ్రెస్ వాదుల ఆలోచన. మరి ఈ విషయంలో రాహుల్ గాంధి నిర్ణయం ప్రయోజనం కలిగించేలా ఉంటుందా? రాహుల్ నిర్ణయలేమి కాంగ్రెస్ కొంపే ముంచుతుందా? లేక తెగే వరకూ దారం లాగి చివరలో నిశ్శబ్ధం అయిపోతాడా?  అన్నది  కాలమే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: