ఏపీలో ఎన్నికలు ముగిసినా చంద్రబాబు హడావిడి కొనసాగుతూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తున్నారనన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పాత సీఎంలాగానే అధికారిక సమీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. 


చంద్రబాబు నిర్వహించిన కొన్ని సమీక్షలకు ఛీప్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరు కాలేదు. రాజధాని సంస్థపై సమీక్ష చేసిన చంద్రబాబు హోం శాఖ సమీక్ష సమాయానికి ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని అదికారులు చెప్పడంతో ఆ మీటింగ్ ఆపేశారట. జూన్ ఎనిమిది వరకు తానే ముఖ్యమంత్రిని అంటున్న చంద్రబాబు ప్రతి రోజూ ఏదో ఒక వివాదం సృష్టిస్తుండడం వివాదం అవుతోంది. 

చంద్రబాబు సమీక్షలపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులు, అధికారులతో సమీక్షలు, వీడియో సమీక్షలు నిర్వహించరాదని ఈసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ నిబంధనలను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు సమీక్షలపై ఈసీ వివరణ కూడా కోరింది. 

చంద్రబాబు సమీక్షలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రధాన కార్యదర్శి ద్వారా ఆయా శాఖ ల నుంచి నివేదికలు కోరతామన్నారు. ఆయా శాఖల సమాధానాలు ఆధారంగా చర్యలు ఉంటాయని ద్వివేది అన్నారు. అయినా ఫలితాలు వచ్చేవరకూ విశ్రాంతి తీసుకోక ఈ హడావిడి ఏంటని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: