ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తరుచూగా బాలన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ ఇష్టారీతిగా కామెంట్లు చేశారు. సరే.. ఎన్నికల వేళ అంటే రాజకీయం కోసం ఏదైనా మాట్లాడుతారు అనుకోవచ్చు..కానీ  ఆ తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. 


తాజాగా ఏపీ సీఎస్‌ జగన్ సహనిందితుడని చంద్రబాబు చేసిన కామెంట్ చాలా వివాదాస్పదమైంది. ఏకంగా సీఎస్‌ ను సహనిందితుడు అని ఎలా అంటారన్న విమర్శలు బాగా వచ్చాయి. అంతే కాదు.మాజీ ఐఏఎస్‌ లంతా దీనిపై  అభ్యంతరం చెప్పారు  

ఐనా.. వెనక్కి తగ్గని చంద్రబాబు.. వారంతా హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడతారు. ఈ గడ్డపై ఉండరు అంటూ కామెంట్ చేయడం మరో వివాదానికి దారి తీస్తోంది. హైదరాబాద్ ఏమీ పాకిస్తాన్ కాదన్న విషయాన్ని చంద్రబాబు కావాలనే విస్మరిస్తున్నారు.

రాష్ట్రం విడిపోయిన మొదట్లో పదేళ్లు ఇక్కడే ఉంటా.. అని ఆయనే చెప్పారు. ఆయన నోటుకు ఓటు కేసులో దొరికిపోయి.. ఉన్నపళంగా అమరావతికి వెళ్తే అంతా హైదరాబాద్‌ ను వదిలేసి రావాలని చెప్పడం ఎలా సబబో ఎవరికీ అర్థంకాని విషయం. స్వయంగా చంద్రబాబే హైదరాబాద్‌లో రాష్ట్రం విడిపోయిన తర్వాతే కొత్త ఇల్లు కట్టుకున్నారు కూడా. మరి ఇదేం లాజిక్ అని జనం అడిగితే చంద్రబాబు ఏం చెబుతారు..? ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు హైదరాబాద్ భయంపట్టుకుందేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: