టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేస్తున్న  దానికి ఎక్కడా పొంతన కనబడడంలేదు. ఈ కారణంగానే బాబు గట్టిగా శ్రేణులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. అదే విధంగా అయన తన పార్టీ వారికి నైతిక స్థైర్యం సైతం పెంచలేకపోతున్నారు. పోలింగ్ జరిగిన తరువాత పరిణామాలు చూసుకుంటే అధికార పార్టీ నేతలు ఇంకా అయోమయంలో ఉన్నారనే అనిపిస్తోంది.



మేము 130 సీట్లు గెలిచేస్తున్నామని ఓవైపు చెబుతున్న చంద్రబాబు మరో వైపు వైసీపీ నేతలతో టచ్ లో ఉండండని చెప్పడాన్ని పార్టీ నాయకులు అర్ధం చేసుకోలేకపోతున్నారు. నిజంగా అంత  గ్రాండ్ విక్టరీ కనుక సాధిస్తే పక్క పార్టీ వారి అవసరం ఏమొచ్చిందని కూడా వారిలో వారే తర్జన భర్జన పడుతున్నారు. అంటే గెలుపు ఆశలు లేవా అన్న సందేహం కూడా వారిని వెంటాడుతోంది. 


ఇదిలా ఉండగా చంద్రబాబు పార్టీనాయకులకు వైసీపీ నేతలకు గేలం వేయండని చెప్పడాన్ని సీనియర్ వైసీపీ   నేత బొత్స సత్యనారాయణ తప్పుపడుతున్నారు. మేమే గెలుస్తామని చెప్పుకుంటూ ఇలా పార్టీ వారికి డైరెక్షన్ ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు. టీడీపీ మరో మారు అధికారంలోకి రాదన్నది అందరికీ తెలిసిందేనని, ఇక తప్పుడు విధానాలతో రావాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రజలు  టీడీపీకి గట్టి బుద్ధి చెబుతారని రానున్న రోజుల్లో వైసీపీదే అధికారమని ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే టీడీపీలోనూ, చంద్రబాబులోనూ ఓటమి భయం కనిపిస్తోందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: