సోషల్ మీడియా.. కొన్ని పత్రికల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేసి.. మీడియాను చెరవిడిపించి సామాన్యుడికి దగ్గర చేసిన మీడియా.. మొదట్లో ఇది కేవలం వర్గర్ కంటెంట్‌ కే సోషల్ మీడియాలో ప్రయారిటీ ఉండేది. ఆ తర్వాత ట్రెండ్ మారింది. 


ఇప్పుడు ఏదైనా వాస్తవాన్ని దాచి పెట్టడం కష్టం.. అలాగే ఏదైనా విషయాన్ని వక్రీకరించి చెప్పడం కష్టం.. గతంలో పత్రికల గుత్తాధిపత్యం ఉండే రోజుల్లో వారి చెప్పిందే వేదం.. వారి రాసిందే కథనం.. కానీ ఇప్పుడు ప్రముఖ పత్రికల కథనాల్లలో అసలు లోగుట్టు ఏంటో సోషల్ మీడియా చెప్పేస్తోంది. 

ఏదైనా విషయాన్ని గతంలో కొన్ని పత్రికలు దాచేసేవి.. కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలో వచ్చేస్తాయి కాబట్టి మనం ఆపడం ఎందుకని అన్నీ చూపించేస్తున్నాయి. కానీ మళ్లీ ఇప్పుడు మళ్లీ హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కానీ సెలబ్రెటీలకు సంబంధించిన చవకబాబు వార్తలకు మళ్లీ ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదం ఉంది. కానీ ఎన్నికల తర్వాత మళ్లీ ఇలాంటి ట్రెండ్ రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకూ ఉంది.  సోషల్ మీడియా ప్రజల ఆయుధం దాన్ని సక్రమంగా వాడే విచక్షణ మనకు ఉందని జనం నిరూపిస్తే అంతకుమించి కావల్సిందేముంటుంది..? 



మరింత సమాచారం తెలుసుకోండి: