తెలంగాణ ఇంటర్ బోర్డు లోపాలు జరిగాయని నిన్న విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెలిసిందే.  ఈ మద్య విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగిపోతోంది. అది ఎంతలా పెరిగాపోయిందంటే పరీక్షలో ఉత్తమ మార్కులు రాకపోయినా.. లేదా పరీక్షలో తప్పిన ప్రాణాలు తీసుకునే స్థాయి వరకు వెళుతోంది.  అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇతరుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి..మంచి ర్యాంకులు రావాలని అటు ఉపాద్యాయులను ఇటు విద్యార్థులపై వత్తిడి తీసుకు రావడం జరుగుతుంది.  ఈ నేపద్యంలో కాలేజీకి మంచి పేరు తీసుకుచ్చి మార్కెటింగ్ చేసుకోవాలన్న తపనతో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి మరోవైపు వెరసి విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాలతో పాస్ కాని విద్యార్థులు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గురువారం ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన కొద్ది గంట్లోనే రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ముగ్గురు శుక్రవారం సూసైడ్ చేసుకున్నారు. ఈ ఫలితాల ప్రభావం ఏపిలో ఎంపి సీఎం రమేష్ మేనళ్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ పరీక్షలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ విద్యార్ధిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలయ్యామని.. తక్కువ మార్కులొచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపెడు తున్నాయి.ఇంటర్ మార్కుల జాబితాలో నెలకొన్న అవకతవకలపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు ముందు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్ మెమోలో మార్కులు తారుమారయ్యాయని.. పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ వారు ఆరోపించారు. తాజాగా విద్యార్థుల ఆత్మహత్యలపై ఎమ్మెల్యే హరీష్ రావు స్ఫందించారు.  ఇంటర్‌లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదని, ప్రాణాలు తీసుకోవద్దని టీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటే తన గుండె తరక్కుపోతోందని అన్నారు. పిల్లలను ఒత్తిడికి గురిచేసే పనులు చేయొద్దని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: