జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ట్విట్టర్ వేదికగా వీరిరువురి కౌంటర్- ఎన్‌కౌంటర్‌ కలకలం సృష్టిస్తున్నాయి. జేడీ లక్ష్మీనారాయణను టార్గెట్ చేసినట్టుగా విజయసాయిరెడ్డి ట్వీట్స్ పెడుతున్నారు. 


అయితే ఈ ట్వీట్ల యుద్ధం వెనుక అసలు కథ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని జేడీ లక్ష్మీనారాయణ సూచనప్రాయంగా తన ట్వీట్ల ద్వారానే బయటపెట్టారు. జేడీ మొదట తెలుగుదేశంలో చేరదామనుకున్నారని.. ఆ తర్వాత లోక్‌ సత్తా వైపు చూశారని.. చివరకు జనసేనలో చేరారని.. మూడు నెలలు.. మూడు పార్టీలు అంటూ పర్సనల్ ఎటాక్ చేశారు. 

ఈ సమయంలో స్పందించిన జేడీ.. అసలు గుట్టు బయటపెట్టారు. మీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను మరో రూపంలో వ్యక్తం చేస్తున్నారా.. అని బదులిచ్చారు. అంటే జేడీ లక్ష్మీనారాయణను విజయసాయిరెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారనే అర్థం వచ్చేలా ఈ కామెంట్స్ ఉన్నాయి. 

మరి నిజంగానే జేడీని వైకాపా ఆహ్వానించిందా.. వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయా.. జేడీ వైకాపాలో చేరికపై ఆలోచించి చివరకు వద్దనుకున్నారా.. అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బహుశా జగన్ అవినీతిపై దర్యాప్తు చేసిన తనే మళ్లీ జగన్ పార్టీలో చేరడం బావుండదనుకున్నారో ఏమో చివరకు జేడీ జనసేనలో చేరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: