రాష్ట్రంలో రాజకీయ పరిపాలన ముఖ్యమంత్రి చేతిలో ఉంటే.. దాన్న అమలుచేసే ప్రభుత్వయంత్రాగం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉంటుంది. సీఎస్ అన్న పోస్ట్ అంత కీలకమైంది. ప్రస్తుత ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంపై ఏపీ సీఎం చంద్రబాబు చాలా ఆగ్రహంగా ఉన్నారు. 


ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ నిందితుని చంద్రబాబు కామెంట్ చేశారు. తెలుగుదేశం నాయకులు కూడా సీఎస్‌ ను నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు, టీడీపీ నాయకులు సీఎస్ ను ఇంతగా టార్గెట్ చేయడానికి చాలా పెద్ద కారణమే ఉందట. 

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీ అయిన దాదాపు 18 జీవోలను సీఎస్ గా సుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాత నిలిపేశారట. ఈ జీవోలన్నీ ఆర్థిక లావాదేవీలు. భూముల కేటాయింపులు వంటి నిర్ణయాలను అమలు కాకుండా ఆపేశారట. దీంతో ఈ జీవోల ద్వారా లబ్దిపొందాల్సిన వారు సుబ్రహ్మణ్యంపై కక్ష పెంచుకున్నారన్నమాట. 

ఈ కారణంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని టీడీపీ శ్రేణులు విమర్శించడం.. పదే పదే తప్పుబట్టడం చేస్తున్నారట. తోక పత్రికగా చెప్పుకునే ఓ పచ్చ పత్రికలోనూ పనిగట్టుకుని సీఎస్ సుబ్రహ్మణ్యంపై దుష్ప్రచారం సాగిస్తున్నారట. ఇంత జరిగినా సుబ్రహ్మణ్యం మాత్రం  తనపని తాను చేసుకుపోతున్నారట. అదీ అసలు సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: