సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ మాజీ నేత బండ్ల గణేష్ సిల్వ‌ర్ స్క్రీన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించాడు. అయితే తానేందుకు రాజకీయాల నుంచి తప్పుకున్నాననే దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


ప్రజాసేవ చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చానని బండ్ల గణేష్ అన్నారు. అయితే, తాను రాజకీయాలకు పనికిరానని.. అందులోకి వెళ్లిన రోజునుండి ఆ విషయం త‌నకు తెలుస్తూ వచ్చిందన్నారు. రాజకీయాల్లో ఉంటే.. ఏ తప్పు చెయ్యని వాళ్ళపై ఆరోపణలు చేయాల్సి వస్తుందని అన్నారు. దీనితో శత్రువులు పెరుగుతారని.. ఆప్తులకు దూరమవుతామని ఆయన తెలిపారు. 


కాగా ఎన్నికల సమయంలో కేటీఆర్, కేసీఆర్‌లపై ఏదేదో మాట్లాడానని.. కానీ వారు ఏనాడు తనను ఒక్క మాట అనలేదని గుర్తుచేసుకున్నారు. దీనితో రాజకీయాలు చేయలేనని భయమేసింది. అందుకే నన్ను నేను మోసం చేసుకోవడం ఎందుకని రాజకీయాలకు శాశ్వతంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు బండ్ల గణేష్ వెల్లడించారు. అందుకే తాను రాజ‌కీయాలకు గుడ్ బై చెప్పాన‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు తాను ఏ పార్టీ వ్యక్తిని కాదు.. గుడ్ బై చెప్పేశాన‌న్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని అయితే రాహుల్ ను ప్రధానిగా, పవన్ కల్యాణ్ ని ఏపీ సీఎంగా చూడాలన్న ఆశ తనకు ఉందన్నారు.


అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అనవసరంగా కొన్ని మాట్లాడానని.. ఇప్పుడు వాటికి బాధపడుతుంటానని బండ్ల గ‌ణేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో కేటీఆర్, కేసీఆర్‌లపై ఏదేదో మాట్లాడానని.. కానీ వారు ఏనాడు తనను ఒక్క మాట అనలేదని గుర్తుచేసుకున్నారు. దీనితో రాజకీయాలు చేయలేనని భయమేసిందన్నారు. తాను రాజకీయాలకు పనికిరానని, అందులో ఉన్నప్పటి నుంచి అనవసరంగా తనకు శత్రువులు అవుతున్నారని, నేను జీవితంలో కొన్ని తప్పులు చేశానన్నారు. అందుకే త‌న‌ను తాను మోసం చేసుకోవడం ఎందుకని రాజకీయాలకు శాశ్వతంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు బండ్ల గణేష్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: