రేపటితో మూడవ దశ ఎన్నికలు దేశంలో ముగుస్తాయి. మరో నాలుగు విడతలు మిగిలిఉన్నాయి. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో దేశంలో మరో మారు మోడీ అధికారంలోకి వస్తారని అంతా అంచనాలు వేసుకుంటున్నారు. అయితే మోడీ నాయకత్వంలోని జాతీయ కూటమికి పూర్తి స్థాయి బలం రాదని ఎన్నికల సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపధ్యంలో మోడీకి అవసరమైన మద్దతు బయట నుంచి ఎలా లభిస్తుందన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది.


ఈ క్రమంలో ఓ న్యూస్ లేటెస్ట్ గా వైరల్ అవుతోంది. కేంద్రంలో బీజేపీకి, మోడీకి మద్దతు ఇవ్వడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు పార్టీలు సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. ఆ పార్టీలు వైసీపీ, టీయారెస్ తో పాటు, జనసేన అని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఓ లెక్క ఉంది. ఐతే జనసేన కూడా కనీసంగా రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని భావిస్తున్నారు. అలాగే, టీయారెస్ సైతం తెలంగాణాలో ఎక్కువ సీట్లను సాధించవచ్చు.


ఇలా చూసుకున్నపుడు ఈ మూడు పార్టీలు కలుపుకుని 35 సీట్ల వరకు వస్తాయని, అవి మోడీ మరో మారు ప్రధాని కావడానికి సరిపోయే బలాన్ని ఇస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఈ మూడు పార్టీలతో అనుసంధానం అవుతున్న వారుగా ఉమ్మడి గవర్నర్ నరసిమ్హన్ పేరు బాగా వినిపిస్తోంది. ఆయన ఎన్నికల అనంతరం కూడా అటు జగన్, పవన్, కేసీయార్ లతో టచ్ లో ఉంటూ వారి మద్దతుని కూడగట్టే కీలకమైన పనిలో ఉన్నారని చెబుతున్నారు.


ఎలాగైనా కేంద్రంలో మరో మారు మోడీని ప్రధానిని చేయాలన్న ఆశయంతో గవర్నర్ ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. తద్వారా జూలైతో తన పదవీకాలం ముగియనున్నందున  మరో అయిదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీ గవర్నర్ గా 2024 వరకూ కొనసాగాలన్నది నరసిమ్హన్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇందులో వింత ఏంటి అంటే జనసేన మోడీకి మద్దతు అంటూ ప్రచారంలోకి రావడం. రాజకీయాల్లో దేన్ని కొట్టి పారేయలేమని కూడా అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: