తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో వెయ్యికి 900 మార్కులకుపైగా వచ్చిన టాపర్లు కూడా ఫెయిలయ్యారు. కొంతమందికి అయితే ఏకంగా ఒక సబ్జెక్ట్‌ మార్కులే గాయబ్‌! మార్కుల బదులు ‘ఏపీ, ఏఎఫ్‌, ఈపీ’ వంటి అర్థం లేని సంకేతాలు వచ్చిన విద్యార్థులు వందల్లోనే ఉన్నారు.  ఎన్నో ఆశలతో ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతామనుకున్న విద్యార్థులు 0,1 , 2 మార్కులు చూసి నివ్వెర పోయారు. మరోవైపు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.


ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.. ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియెట్‌ ఫలితాల విషయంలో వస్తున్న అపోహలను నివృత్తి చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  స్పందించారు.


తల్లిదండ్రులు, విద్యార్థులు కంగారుపడొద్దని కోరారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.  ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామన్నారు. ఏ ఒక్క విద్యార్ధికి కూడా నష్టం జరగకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: