తెలంగాణలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా పార్టీలకు అనుబంధంగా ఉన్న పత్రికలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ విచిత్రంగా తెలంగాణలో ప్రభుత్వ అధికార పత్రికగా పేరున్న పత్రికలో అవినీతిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. 


మరి ఎందుకు ఇలా జరుగుతోంది. దీనికి వెనుక పెద్ద కారణమే ఉంది. కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా మార్చేయాలనుకుంటున్నారు. కొత్త చట్టాలు తేవాలనుకుంటున్నారు. అసలు రెవెన్యూ శాఖనే రద్దు చేసే ఆలోచన కూడా ఉందంటున్నారు. 

ఓ కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. అలాగే రెవెన్యూ శాఖను రద్దుచేయాలంటే ముందు దానిపై అవినీతి ముద్ర వేయాలి.. ఇప్పుడు ఇదే జరగుతోందా అనిపించక మానదు. కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థపై దృష్టి సారించడం మంచిదే.

అల్టిమేట్‌ గా ప్రజలకు మంచి జరగడమే ప్రజాస్వామ్యంలో కావాల్సింది. కానీ అందుకోసం ఓ శాఖ మొత్తాన్ని లంచగొండి శాఖగా ముద్రించడం మంచిదేనా.. రేపు ఇదే అధికారులు ప్రజలకు సేవ అందించాల్సి ఉంటుంది. మరి వీరిని జనం నమ్ముతారా..అసలు ఇంత అవినీతి జరుగుతుంటే ఐదేళ్లపాటు కేసీఆర్ సర్కారు ఏం చేసినట్టు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: