టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. ముక్కుసూటిగా మాట్లాడతాడు. కొన్ని సార్లు పార్టీ నే ఇబ్బందుల పాలు చేస్తాడు. అయితే తాము మొత్తం యాభైకోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేసినట్టుగా జేసీ ఓపెన్ గా ప్రకటించారు. ఓటుకు రెండువేల రూపాయల చొప్పున పంచినట్టుగా ఆయన తెలిపారు. కొందరు ఓటర్లు అయితే ఓటుకు నాలుగు, ఐదువేల రూపాయలు అడిగారని, అయితే తాము ఓటుకు రెండువేల రూపాయల చొప్పున పంచినట్టుగా జేసీ చెప్పారు. జనాలు కమర్షియల్ గా మారిపోయి ఓటుకు మరీ అన్యాయంగా రేటు పెంచేశారని జేసీ వాపోయారు.


చివరకు ఓటు రేటు రెండువేల రూపాయలకు తెంచినట్టుగా చెప్పారు. తామేకాకుండా అందరూ డబ్బులు పంచారని, ఓవరాల్ గా ఈ ఎన్నికల్లో రాజకీయ నేతలు పదివేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఖర్చు పెట్టారని జేసీ అన్నారు. రాజకీయాలు అలా కాస్ట్లీ అయిపోయాయని వాపోయారు. ఇలా పంచిన డబ్బు అంతా అవినీతి సొమ్మే అని కూడా దివాకర్ రెడ్డి తేల్చేశారు. మరి తాము పెట్టిన ఖర్చు గురించి దివాకర్ రెడ్డి ఇలా ఓపెన్ గా చెప్పేశారు.


ఈ వ్యాఖ్యలు ఈసీ నియమనిబంధలకు వ్యతిరేకం. ఈమాట ద్వారా జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో వాళ్లు పోటీచేసిన నియోజకవర్గాల ఎన్నికను  రద్దు చేయవచ్చు కూడా. అయితే అలాంటి చర్యలు ఎవరూ తీసుకోలేరనేది వీరి ధీమా. గత ఎన్నికల్లో తను భారీగా ఖర్చుపెట్టి గెలిచినట్టుగా ప్రకటించుకున్న కోడెల మీద ఏం చర్యలు తీసుకున్నారు? అదే ధీమాతో జేసీ కూడా పెట్టిన ఖర్చు గురించి ఓపెన్ గా చెప్పినట్టున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: