తెలంగాణలో ఇంటర్ బోర్డు నిర్వాకంతో పలువరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.  తప్పకుండా పాస్ అవుతామని ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే..0,1,2,5 ఇలా మార్కులు రావడంతో గుండె పగిలిపోయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  అయితే తమ పిల్లలు కష్టపడి చదివినా కూడా ఇలాంటి మార్కులు రావడం ఏంటీ అని తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. 

చిలికి చిలికి గాలివానలా మారింది..దాంతో ఇంటర్ బోర్డ్ వారు తమ తప్పులు తెలుసుకొన్నారు.  మార్కలు వివాదంపై వివరణ ఇచ్చారు ఇంటర్ బోర్డు కార్యదర్శి .  ఓఎంఆర్ బబ్లింగ్ లో ఎగ్జామినర్ పొరపాటు చేశారు. తప్పు చేసిన అధికారులను వివరణ కోరాం. ఎగ్జామ్ పేపర్లు గల్లంతైన మాట అవాస్తవం. సెంటర్ మారడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చాయి.  తప్పలు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 

తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకున్నాం.  ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదు..అందరికీ న్యాయం చేస్తాం. ఏజెన్సీ పొరపాటు ఉంటే చర్యలు తప్పవు.  పేపర్ వాల్యూయేషన్ లో పొరపాటు ఉంటే బాధ్యులపై చర్యలు..టెక్నికల్ కమిటీ వేశాం, 3 రోజుల్లో నివేదిక వస్తుంది. 

నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు.  ఫ్రీగా రి వాల్యుయేషన్ చేయడం కష్టం. పోటీ పరీక్షలు రాసేవారికి ఇబ్బందులు వస్తాయి. అవసరం అనుకుంటే దరఖాస్తు గడువు పెంచుతాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: