టీడీపీ అధినేత చెబుతున్నదానికి .. బుద్ధా వెంకన్న చెబుతున్న దానికి అసలు పొంతన ఉండటం లేదు. కర్ణాటకలో ఏ మూడ్లో మాట్లాడారో కానీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీకి 170 ఎంపీ పీట్లు దక్కుతాయని అన్నారు. అదేదో చిన్న నంబర్ అన్నట్టుగా బాబు అనుకూల మీడియా ఆ మాటలను తాటకాయంత రాతలతో అచ్చేసింది. అయితే గతంలో కాంగ్రెస్ వాళ్లు కేవలం నూటా నలభై సీట్లు సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలున్నాయి.


యూపీఏ -1, 2 సాధించిన మెజారిటీలు ఆ మాత్రం స్థాయివే. వాటితోనే ప్రభుత్వాలు అప్పుడు పదేళ్లపాటు మనుగడ సాధించాయి. చంద్రబాబేమో యూపీఏ వన్ కన్నా బీజేపీకి ఎక్కు సీట్లు వస్తాయని తేల్చారు. బాబే ఇలా తేలిస్తే.. బీజేపీ బలం అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు అనే అభిప్రాయాలు వినిపించడం మొదలయ్యాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీకి వెలిగింది. అందుకే సాయంత్రానికి బుద్ధా వెంకన్న దిగిపోయారు.


బీజేపీకి నూటా డెబ్బై కాదు, నూటా ఇరవై సీట్లే అని ఈయన తేల్చేశారు. ఇలా బాబుతోనే విభేదించి ప్రకటన చేశారు ఆయనగారి వీరభక్తుడు. అయినా నూటా ఇరవై, నూటా డెబ్బై అంటూ తెలుగుదేశం నేతలు ఎందుకు బీజేపీ విషయంలో ఇంతగా చిలకజోస్యం చెబుతున్నారు.. ఎందుకంత టెన్షన్ పడుతున్నారనే సందేహాలు సామాన్యుల్లో కలుగుతూ ఉన్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: