గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న సందడి అంతా ఇంతా కాదు.  ఇప్పటికే పలు చోట్ల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పూర్తయ్యాయి.  నేడు మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి.   ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది.దయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు తమ రాకకోసం ఎదురుచూస్తున్నారు. మొత్తం 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.


ఇక దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 14 రాష్ట్రాల్లో మొత్తం 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజానికి మూడో దశ ఎన్నికలు 115 స్థానాల్లోనే జరగాల్సి వుంది. అయితే, రెండో దశలోనే పోలింగ్ జరగాల్సిన త్రిపురలోని తూర్పు స్థానం ఎన్నికను మూడో దశకు మార్చడంతో ఓ స్థానం పెరిగింది.


కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, జయప్రద, వరుణ్ గాంధీ, సుప్రియా సూలె, శశిథరూర్, మల్లికార్జున ఖర్గే తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ స్థానాలతోపాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. మొన్న శ్రీలంకలో ఉగ్రవాదుల దాడులు జరిగిన కారణం చేత అక్కడ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.  నిన్న కూడా బాంబు నిర్వీర్యం చేస్తున్న సమయంలో పేలిపోయింది.  కాగా, బాంబు దాడిలో 300 పైగా మృతుల సంఖ్య పెరిగిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: