వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, అలాగే ఒక రోజు కాదు. పదేళ్ళుగా జగన్ పోరాడుతూనే ఉన్నారు. జగన్ అనుభవ రాహిత్యం ఓ వైపు ఉంటే మరో వైపు పలుకుబడి బాగా కలిగిన  రాజకీయ కామందులు స్రుష్టించిన కారు మేఘాల్లాంటి ఆరోపణలు జగన్ జీవితాన్ని చెడుగుడు ఆడుకున్నాయనే చెప్పాలి.


అయితే జగన్ కేసులను డీల్ చేసి తద్వారా ఓ  ఇమేజ్ సంపాదించుకున్న జేడీ లక్ష్మీనారాయాణ ఆ కేసుల విషయంపై తాజాగా ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలొ మాట్లాడుతూ సంచలమైన విషయాలు చెప్పుకొచ్చారు. అసలు జగన్ లక్ష కోట్లు ఆరోపణలు అన్నది పూర్తిగా అర్ధరహితమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ జగన్ పై లక్ష కోట్ల అవినీతి అని ఆరోపణలు ప్రచారం చేయడం రాజకీయంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారట.


తాము ఎక్కడా అబియోగాలలో లక్ష కోట్లు అని చెప్పలేదని, ఎవరైనా రాజకీయం కోసం అలా ప్రచారం చేసుకుంటే తమకు సంబందం లేదని ఆయన అన్నారు.తమకు లభించిన ఎవిడెన్స్ ఆదారంగా కేసులు పెట్టామని ఆయన చెప్పారు.మొత్తం మీద 1500 కోట్ల ఆరోపణ ఉండవచ్చని ఆయన అన్నారు.లక్ష్మీనారాయణ రాజకీయాలలోకి వచ్చి జనసేన తరపున పోటీచేసిన తర్వాత ఈ విషయం చెప్పడం విశేషం.
మరి ఇప్పటికైనా జగన్ పచ్చి అవినీతిపరుడని, ఆయన లక్ష కోట్లు తినేశాడని చెబుతూ వస్తున్న ఎల్లో మీడియా ఆరోపణలు, పచ్చ పార్టీ నేతల విమర్శలు సాక్షాత్తు జేడీ లక్ష్మీనారాయణ  చెప్పిన తరువాత అయినా ఆగుతారా. ఇంకా కొనసాగిస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: