విశాఖపట్నం ఎంపీ.. ఏపీ పార్లమెంట్ ఎన్నికల్లో హాట్ సీట్ ఇది. ఇక్కడ మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.. కొత్త పార్టీ పెడతాడని భావించి జేడీ చివరకు జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీ బరిలో దిగారు. 


జేడీతో పాటు ఇక్కడ అంతా వీఐపీలే పోటీలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత భరత్ టీడీపీ తరపున బరిలో ఉన్నారు. మరోవైపు నందమూరి ఫ్యామిలీకే చెందిన పురంధేశ్వరి కూడా బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. 

పోలింగ్ జరిగిన సరళిని బట్టి చూస్తే జేడీ కోసం క్రాస్ ఓటింగ్ జరిగిందని.. కొందరు టీడీపీ నేతలు కూడా అసెంబ్లీ టీడీపీకి.. పార్లమెంట్ జేడీకి వేయమని తమ కార్యకర్తలకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ కారణంగా జేడీ గెలుపు కాయం అన్నారు. 

అయితే తాజాగా వచ్చిన న్యూ ఆంధ్రా సర్వే మాత్రం  విశాఖపట్నంలో జేడీ లక్ష్మీనారాయణ గెలిచే అవకాశమే లేదంటోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ గెలుపు పక్కా అట. టైట్ ఫైట్ కూడా లేదని ఈ సర్వే చెబుతోంది. మరి ఇది ఎంతవరకూ నిజమవుతుందో..? 



మరింత సమాచారం తెలుసుకోండి: