చంద్రబాబు రాజకీయ జీవితం చిత్ర విచిత్రం. ఆయన తన  నలభయ్యేళ్ళ  పొలిటికల్ లైఫ్ లో ఎన్నో విన్యాసాలు చేశారు. అనేక రకాలుగా వ్యూహాలు పన్నారు. కొన్నిఫలించాయి.  అందుకే ఆయన 14 ఏళ్ళ పాటు సీఎం గా ఉన్నారు. ఇపుడు బాబు వయసు డెబ్బయి ఏళ్ళు. ఆయన ఓ విధంగా జీవిత చరమాంకంలో ఉన్నారు.


మరి బాబుకు ఓ విధంగా  ఈసారి ఎన్నికలు చాలా కీలకమైనవి. ఏపీలో గెలవాలి. లేకపోతే ఆయనకు ఇబ్బందే. అయితే ఏపీలో ప్రజా వ్యతిరేకత బాగా ఉందని చెబుతున్నందువల్ల బాబు ఎందుకైనా మంచిదని ప్లాన్ బీ సిధ్హం చేసుకుని ఉన్నారని అంటున్నారు. దాని ప్రకారం దేశంలో ఎట్టి పరిస్థితుల్లో మోడీ మళ్ళీ రాకూడదు, అలా  జరిగితేనే బాబుకు సుఖం. శాంతి ఉంటాయి. మోడీ కనుక ప్రధాని అయితే మాత్రం బాబుకు ఇక్కట్లు తప్పవు


అందుకే ఆయన కాంగ్రెస్ వైపు పూర్తిగా వాలిపోయారు. దేశంలో కాంగ్రెస్ ని గెలిపించమని గడప గడపా తిరిగి  ఇపుడు ప్రచారం చేస్తున్నారు. దేశంలో మమతా బెనర్జీ, మాయవతి, ములాయం ఇలా ఏ నాయకుడు కాంగ్రెస్ గెలుపు కోరుకోవడం లేదు. ప్రచారం కూడా చేయడం లేదు. బాబు మాత్రమే ఆ విధంగా చేస్తున్నారు. ఎందుచేతనంటే బాబుకు ఇపుడు కాంగ్రెస్ గెలుపు చాలా అవసరం. కాంగ్రెస్ గెలుపులో తన గెలుపు ఆయన చూసుకుంటున్నారు.


కేంద్రంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీ ఆద్వర్యంలో సంకీర్ణం ఏర్పాటు చేసి దాంట్లో  కుదురుకుందామన్నది బాబు ఆలొచనగా చెబుతున్నారు. అంటే ఓ వేళ ఏపీలో అధికారం దక్కపోతే ఉన్న ఎంపీ సీట్లతో డిల్లీ రాజకీయం మొదలుపెడదామని బాబు ఆలొచనగా ఉందంటున్నారు. మొత్తానికి బాబు మెల్లగా కాంగ్రెస్ వైపు మళ్ళిపోతున్నారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన బాబు నలభయ్యేళ్ళ తరువాత ఆ పార్టీ వైపుగా రావడంలో విడ్డూరం ఐతే లేదు. బాబు గురించి ఈ మాట చెబితే అంతకంటే ఆశ్చర్యం కూడా లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: