ఏపీ ఎన్నికల సమయంలో కే ఏ పాల్ ను మీడియా చాలా ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆయన్ని గంటలకు గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసింది. కానీ ఆయన చివరకు తన అభ్యర్థులకు బీ ఫారాలు కూడా ఇచ్చుకోలేకపోయాడు. ఎవరొచ్చినా బీ ఫాం ఇస్తా  అనే రేంజ్‌కు వెళ్లాడు. 


చివరకు ఆయన బీ ఫారాలపై వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లున్న వ్యక్తులు నామినేషన్లు వేశారు. ఇది కేవలం ఫ్యాన్ గుర్తు.. హెలికాప్టర్ గుర్తు మధ్య ఉన్న సారూప్యతను.. పేర్ల మధ్య ఉన్న సారూప్యతను క్యాష్ చేసుకోవడమే.. కనీసం ఓ నాలుగైదు వేల ఓట్లు వైసీపీవి తప్పుగా పడినా అది టీడీపీ గెలుపును ప్రభావితం చేస్తుంది కాబట్టే ఇలా చేశారు. 

కానీ దీన్ని ఎన్నికల కమిషన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎక్కడో సీఎం ఆదిత్యానాథ్‌ ఏదో మీటింగ్‌లో మాట్లాడితే కోపగించుకుని చర్య తీసుకున్న ఈసీ.. పాల్ ప్రతి రోజూ.. నా పార్టీ బీపారాలు దొంగిలించారని చెబుతున్నా.. అదే పార్టీపై టీడీపీ నియమించిన వ్యక్తులు పోటీ చేస్తున్నా.. దీనిపై మీడియాలో రోజూ కథనాలు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. 

చివరకు చంద్రబాబే తన పార్టీ ఏ ఫారాలూ, బీ ఫారాలు చంద్రబాబే తీసుకుని అభ్యర్థులను నిలబెట్టారని పాలే స్వయంగా ఒప్పుకుంటున్నాడు.. టీవీ చానళ్ల డిస్కషన్లలో చెబుతున్నారు. మరి దీనిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.



మరింత సమాచారం తెలుసుకోండి: