ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబునాయుడుతో పాటు మొత్తం టిడిపి నేతలంతా విషం కక్కుతున్నారు. వచ్చే నెల 23వ తేదీన జరగబోయే కౌంటింగ్ తదితరాలపై ఎల్వీ చేసిన సమీక్షపై సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉంది. యనమల వ్యాఖ్యలు చూస్తుంటే ఎల్వీపై ఎంత ధ్వేషంతో ఉడికిపోతున్నారో అర్ధమైపోతోంది.

 

ఎన్నికల ప్రక్రియపై చీఫ్ సెక్రటరీ సమీక్ష చేయటమేంటి ? అంటూ అడ్డుగోలు వాదన మొదలుపెట్టారు యనమల. ఈవిఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు తదితరాలపై ఎల్వీతో పాటు ఎన్నికల కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేది కూడా సమీక్షించారు. సమీక్షలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల కమీషన్ పరిధిలో ఉంటారని యనమల చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు, కౌంటింగ్ కు చీఫ్ సెక్రటరీకి ఏమీ సంబంధం ఉండదన్నారు.  తన పరిధిలో లేని విషయాలపై  చీఫ్ సెక్రటరీ  సమీక్షలు నిర్వహించటమేంటంటూ ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది.

 

ప్రభుత్వ యంత్రాంగం పరిధిలోకి అంటే యనమల ఉద్దేశ్యంలో చీఫ్ సెక్రటరీ రారా ? ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియకు చీఫ్ సెక్రటరీకి ప్రత్యక్షంగా ఏమీ సంబంధం ఉండదన్నది నిజమే. కానీ కౌంటింగ్ సెంటర్ల దగ్గర అవసరమైన ఏర్పాట్లు చేయాల్సింది ప్రభుత్వమే కదా ? పైగా ఎల్వీ ఒక్కళ్ళే సమీక్ష చేయలేదు. ద్వివేదితో కలిసే సమీక్ష జరిగింది. యనమల వ్యాఖ్యలు చూస్తుంటే తమను సమీక్షలు చేయటానికి వీల్లేదని చెప్పినందు వల్ల చీఫ్ సెక్రటరీ పైన కోపం చూపిస్తున్నట్లున్నారు.

 

ఎల్వీ చీఫ్ సెక్రటరీ అవటం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే సీనియర్ అయినా ఎల్వీని పక్కనపెట్టిన చంద్రబాబు అనీల్ చంద్ర పునేఠాను అందలం ఎక్కించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు బదిలీ విషయం ఓవర్ యాక్షన్ చేసిన ఫలితంగా పోస్టింగ్ కు దూరమయ్యారు. దాంతో ఎన్నికల కమీషన్ ఎల్వీని చీఫ్ సెక్రటరీగా నియిమించింది. అప్పటి నుండి చంద్రబాబు ఇటు ఎల్వీతో పాటు అటు ఈసిని కూడా నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత లాగ మంత్రులు కూడా ఎల్వీపై చంద్రబాబు లాగే విషం చిమ్ముతున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: