ఓ వ్యక్తిని నేరుగా ఎదుర్కోలేక అప్పట్లో రెండు ప్రధాన పార్టీలు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకున్నాడనే అబద్ధాన్ని అల్లాయి. తమకు మద్దతుగా నిలిచే మీడియా ద్వారా బలంగా ప్రచారం చేయించాయి. దాని ఫలితంగా ప్రతి ఇంట్లోనో జగన్ లక్ష కోట్లు తినేశాడని, దోపిడిగాడనే బలమైన ముద్ర పడిపోయింది. కాబట్టి అతగాడు అధికారంలోకి వస్తే మిగిలిందేమైనా ఉంటే అది కూడా దోచేసుకుంటాడంటూ పోలోమంటూ తెలుగుదేశంపార్టీకి ఓట్లేశారు.

 

ఇదంతా 2014 ఎన్నికల మాటలేండి. అప్పట్లో అధికారానికి కూతవేటు దూరంలో జగన్ ఆగిపోవటానికి లక్ష కోట్లు దోచుకున్నాడనే ప్రచారం పెద్ద కారణమైంది.  సీన్ కట్ చేస్తే తాము దాఖలు చేసిన చార్జిషీటు ప్రకారం జగన్ పై ఆరోపణలు కేవలం రూ 1500 కోట్లు మాత్రమే అంటూ జేడి లక్ష్మీనారాయణ ప్రకటించారు. అంటే రూ 1500 కోట్లు కూడా ఆరోపణలు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలి.

 

రాజకీయాలు దేశంలో ఏ స్ధాయిలో దిగజారిపోయాయనే విషయానికి జగన్ పై ఆరోపణలే ఓక ఉదాహరణ. తాము అధికారం అందుకోవటం కోసం ఎదుటి వాళ్ళపై ఎంత బురద చల్లటానికి కూడా వెనకాడని తత్వం నేతల్లో ప్రబలిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. 24 గంటలూ రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతూ, తాను నిప్పునంటూ చెప్పుకునే చంద్రబాబునాయుడు కూడా వ్యక్తిత్వాన్ని దిగజార్చేసుకున్నారని స్పష్టమవుతోంది. ఆయనకు మద్దతుగా ఎల్లో మీడియా ఉండనే ఉంది.

 

సరే జగన్ కు జరగాల్సిన డ్యామేజి ఇప్పటికే జరిగిపోయింది. ఎందుకంటే అవినీతికి, దోచుకోవటానికి ప్రతిరూపంగా జగన్ ను చూసే మధ్య తరగతి జనాలు ఇప్పటికీ ఉన్నారు. అయితే ఇంతటి వ్యతిరేక ప్రచారంలో కూడా జనాలు వైసిపిని 67 అసెంబ్లీ, 8 ఎంపిల సీట్లలో గెలిపించారు  2014లో. ఇక్కడే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియాకు మండిపోయింది.

 

అంత బలమైన అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినపుడే జగన్ కు అన్ని సీట్లు వస్తే అబద్ధం పలచబడిపోయిన తర్వాత ఇంకెన్ని సీట్లు వస్తుందన్న భయంతోనే ప్రత్యర్ధులకు నిద్ర పట్టినియ్యటం లేదు. రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు సహజమే. కానీ బురద చల్లేసి తుడిచేసుకోమని చెబితే పడిన బురదను తుడుచుకోవటానికి జీవితకాలం కూడా సరిపోదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: