ఎన్నికల ఫలితాలు కోసం ఇంకా నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి . అయితే ఇప్పటికే పలు సర్వేలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ, టీడీపీలు విజ‌యం మాదంటె మాదే న‌నే ధీమాతో ఉన్నాయి. అన్ని స‌ర్వేలు వైసీపీకే అనుకూలంగా స‌ర్వే రిపోర్టులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇద‌లా ఉంటె ఇప్పుడు మ‌రో తాజా స‌ర్వే వెలుగులోకి వ‌చ్చింది.


ఈ స‌ర్వే జ‌ర్న‌లిస్ట్‌లు చేసిన స‌ర్వే అంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. స‌ర్వేలో ప్ర‌ధానంగా పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా చేసిన‌ట్లు స‌మాచారం. ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో ఏపార్టీ గెలుస్తుంది.. ఏ అసెంబ్లీ సీటు ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాలను ప్రస్తావించారు. ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చిన స‌మాధానంలో వైసీపీ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతంద‌ని స‌ర్వే తెలిపింది.


ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ 131 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ 40 స్థానాలకే పరిమితం అవుతుందట. ఇక జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కేవలం నాలుగు సీట్లకే ప‌రిమితం అవుతుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది.మొత్తం 25 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 23 నుంచి 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేస్తోంది.మరి రాష్ట్రంలో అంత ప్రభంజనం ఉందా.. అనేది ఎన్నికల తర్వాత కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: