కామెంట్స్ చేశామంటే చేశాం అన్నట్లుగా ఉంటోంది తమ్ముళ్ళ తీరు ఈ మధ్య. అసహనం నిండా నింపుకుని మాట్లాడుతున్న మాటల్లా అవి కనిపించడమే ఇక్కడ అసలైన విడ్డూరం. కోడి గుడ్డు మీద ఈకలు పీకే కల్చర్ కి అలవాటు పడిన నేతలు ఇపుడు ఏపీ సీఎస్ ని లక్ష్యంగా చేసుకుని ఎడాపెడా విమర్శలు గుప్పిస్తున్నారు.


ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఆ విమర్శలలో అర్ధం ఉందా లేదా అన్నది వారు మరచిపోతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక‌ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈసీ కను సన్నల్లో పనిచేస్తుంది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న అంశమే. అయితే అది పెద్ద వింత అయినట్లుగా  తప్పు అయినట్లుగా తమ్ముళ్ళ వక్ర భాష్యాలు ఉంటున్నాయి. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఈసీ చెప్పినట్లుగా చేస్తున్నారట. ఈ కామెట్స్ చేసింది ఎవరో కాదు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు.


మరి  సీఎస్ ఈసీ కాకుండా ఎవరి మాట వినాలిపుడు అన్న సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు మాట సీఎస్ వినాలా అని కూడా అడుగుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక బాబు కు ప్రత్యేకంగా అధికారాలు ఉండవని తెలిసినా తమ్ముళ్ళు మాత్రం వూరుకునేట్లు లేరు. ఏదో విధంగా బురద జల్లడానికే చూస్తున్నారు. ఇపుడు ఈసీ మీద కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ఈసీ బీజేపీ కను సన్నల్లో పనిచేస్తోందట. మొత్తానికి తమ్ముళ్ళ తీరు చూస్తుకుంటే వూరికే ఉలికి పడుతున్నారని అర్ధమైపోతోంది. ఈ కామెంట్స్ తో పరువు కూడా పోగొట్టుకుంటున్నారనిపిస్తోంది 



మరింత సమాచారం తెలుసుకోండి: