న్యాయ వ్యవస్థతో పెట్టుకుంటే ఎంతటి అధికార శక్తి అయినా వీగిపోకతప్పదని సుప్రీం కోర్టు ఈ రోజు ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. అది డబ్బు కావచ్చు పలుకుబడి కావచ్చు, మరేమైనా కావచ్చు కానీ న్యాయం ముందు బలాదూర్ అంటూ క్లారిటీగా పేర్కొంది. కుట్ర చేయాలనుకుంటే పటాపంచలు చేస్తామని కూడా హెచ్చరించింది.


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను విచారిస్తున్న ప్రత్యేక ధర్మాసనం ఈ నేపధ్యంలో ఈ కామెంట్స్ చేయడం విశేషం. ప్రధాన న్యాయమూర్తినే రాజీనామా చేసేలా కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ వెసిన పిటిషన్ కి ఆధారంగా మరికొన్ని పత్రాలను ఆయన ఈ రోజు సీల్డ్ కవర్లో సుప్రీం కు అందచేశారు.  తాను అందించిన సమాచారాన్ని ప్రివిలేజ్ గా పరిగణించాలని బెయిన్స్ కోరిన నేపధ్యంలో సుప్రీం కోర్టు చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


తన వద్దకు వచ్చిన ఎలాంటి పత్రాలనైనా పరిశీలించే హక్కు సుప్రీం కోర్టుకు ఉందని కూడా జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత మూడు నాలుగేళ్ళ నుంచి సుప్రీం కోర్టుపై వివిధ ఆరోపణలు వస్తున్నాయని, తాజాగా రంజన్ గోగోయ్ పై వచ్చిన ఆరోపణలు కూడా అందులో భాగమేనని ధర్మాసనం చెప్పడం విశేషం. ఉన్నత స్థాయి నాయ వ్యవస్థలో పనిచేసేవారు ఎవరూ తప్పులకు పాల్పడరని కూడా ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ   తప్పులు చేస్తే ఎలాంటి  వారినైనా  కూడా న్యాయస్థానం ఏ విధంగానూ  సమర్ధించదని కూడా క్లారిటీగా చెప్పడం విశెషం.


మొత్తానికి చూసుకుంటే రంజన్ గొగోయ్ మీద వచ్చిన ఆరోపణల విషయంలో సుప్రీం చాలా సీరియస్ గా ఉన్నట్లుగాకనిపిస్తోంది. ఈ పరిస్థితిని మొత్తం మధింపు చేయడమే కాకుండా భవిష్యత్తుల్లో ఇటువంటివి రాకుండా పర్మనెంట్ గా చెక్ పెట్టే దిశగానే సుప్రీం యాక్షన్ ప్లాన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: