ఇంట‌ర్‌మీడియ‌ట్ ఫ‌లితాల దుమారం ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు ఎవ‌రూ తొంద‌ర‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్ద‌ని, ఫ్రీగా రీవాల్యూయేష‌న్ చేయించి న్యాయం చేస్తామ‌న్నా నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మినిస్ట‌ర్స్ క్వాట‌ర్స్‌ను బీజేవైఎం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ముట్ట‌డించారు. లోప‌లికి వెళ్లేందుకు య‌త్నించారు. కానీ అక్క‌డ ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల జీవితాల‌తో ఆట‌లాడుతున్న బాద్యుత‌ల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 19 మంది విద్యార్థుల బ‌లికి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. 


ఇంట‌ర్ ప‌రీక్ష‌లో దాదాపు 3 ల‌క్షల మందికి పైగా విద్యార్తులు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌భుత్వం ఫ్రీగా రీ వాల్యూయేష‌న్‌, రీ వెరిఫికేష‌న్‌కు ఆదేశించారు. దీంతో అధికారులు ఆ దిశ‌గా ముందకు సాగుతున్నారు. ప్ర‌భుత్వ  ఆదేశాలు అధికారులు కూడా వెంట‌నే స్పందించారు. చర్య‌లు తీసుకుంటున్నారు. హైద‌రాబాద్‌లో రీ వెరిఫికేష‌న్ కు ద‌రఖాస్తు చేసుకునేందుకు 8 సెంట‌ర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక రీ వెరిఫికేష‌న్‌, రీ వాల్యూయేష‌న్ కు డ‌బ్బులు క‌ట్టిన వారికి తిరిగి చెల్లిస్తామ‌ని అధికారులు తెలిపారు. 


ఇదిలా ఉంటే మ‌రోవైపు ఇంటర్మీడియ‌ట్ ఫ‌లితాల్లో జ‌రిగిన త‌ప్పుల‌పై అధికారులు ఒప్పుకున్నారు. మిస్టేక్ అయిన మాట వాస్త‌వ‌మేన‌ని అన్నా విద్యాశాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ధ‌న్‌రెడ్డి..వీలైనంత త్వ‌రగా పున‌ప‌రిశీల‌న చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సారి త‌ప్పుల‌కు ప్ర‌తి ఒక్క‌రు బాద్యులేన‌ని అన్నారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చూస్తామ‌న్నారు.. అలాగే విద్యార్థుల్లో మ‌నోస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామ‌న్నారు. 


ఇంట‌ర్ విద్యార్థుల మూల్యాంకల‌నం నేప‌థ్యంలో అధ్యాపకుల సెల‌వులు ర‌ద్ద‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రో రెండు రోజుల్లో దీనిపై అధికారికంగా ఉత్త‌ర్వులు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల్లో 11 వందల మంది అధ్యాప‌కులు, నాలుగు వేల మంది కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లు ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: