ఇప్పటికే ఎన్నో సర్వేలు వెలువడినా..ఇంకా పలు సర్వే సంస్థలు తమ ఫలితాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. కచ్చితత్వం కోసం కాస్త టైమ్ తీసుకున్నామని చెబుతున్న సంస్థలు కొన్ని ఆలస్యంగా అంచనాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో తాజాగా న్యూ ఆంధ్రా పేరుతో ఓ సర్వే వచ్చింది.


ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందట. ఇక గట్టి పోటీ ఇస్తుందని కలవరపెట్టిన జనసేన ఆరు స్థానాలు మాత్రమే సాధిస్తుందట. మరో 20 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందట. 


ఎంపీ స్థానాల్లో వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు 18 ఎంపీ స్థానాలు వైసీపీ కచ్చితంగా గెలుచుకుంటుందన్నది ఆ సర్వే అంచనా. టీడీపీ కచ్చితంగా ఐదు ఎంపీ స్థానాలు గెలుచుకోబోతోందట. మరో రెండు ఎంపీ స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. 

ఈ సర్వే ప్రకారం జగన్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంలో ఏపీలో ఎప్పుుడు ఎన్నికలు జరిగినా స్వీప్ రిజల్ట్స్ కనిపించేవి. ఈ సర్వేను బట్టి వేవ్ ఉన్నా అది తక్కువగానే కనిపిస్తోంది. ఒక విధంగా ఇది బొటాబొటి మెజారిటీగానే చెప్పుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: