ఎన్నికలు అయిపోయాయి. నేల రోజులకు పైగా సమయం ఉంది. హ్యాపీగా విశ్త్రాంతి తీసుకోవాలనుకుంటే రాజకీయం కుదరనివ్వట్లేదు.  ఇంకా ఎన్నికలు, పోలింగ్, ఓటింగ్ ఇలా ఉంది పార్టీల పరిస్థ్తి. విశాఖ జిల్లాలో ఇంకా ఎన్నికల వేడి ఎక్కడా తగ్గలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి.


పోస్ట్ల బ్యాలెట్ చుట్టూ ఇపుడు విశాఖ రాజకీయం సాగుతోంది. విశాఖ జిల్లాలో ఎన్నికల విధులకు వెళ్ళిన ఉద్యోగుల సంఖ్య అచ్చంగా యాభై వేల వరకూ ఉంటుంది. వీరిలో వేలాదిమందికి పోస్టల్ బాలెట్లు ఇప్పటికీ  అందలేదు. దాంతో అందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు.


మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నాయకత్వంలో లేటెస్ట్ గా మరో మారు కలెక్ట‌ర్ ని కలసిన వైసెపీ బ్రుందం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రతి ఉద్యోగికి ఓటు వేసే హక్కు ఉండాల్సిందేనని కోరారు. పోలింగ్ ముందు రోజు వరకూ అంటే అప్రిల్ 10 వరకూ పోస్టల్ బ్యాలెట్ కి దరఖాస్తు చేసుకునే  అవకాశం ఉన్నా విశాఖ జిల్లాలో మాత్రం 7వ తేదీతోనే దాన్ని గడువు ముగించారని వైసీపీ నేతలు ఆరోపించారు.


ఇక నాలుగు వేల మందికి పైగా ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వలేదని కూడా పేర్కొన్నారు. ఇది అన్యాయమని,  సేవ్ డెమోక్రసీ అంటూ చెబుతున్న చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు ఓటు హక్కు లేకపోవడం దారుణమని అంటున్నారు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేలు వంతున పోస్టల్ ఓట్లు ఉన్నాయి. హోరా హోరీ పోరు జరిగిందిపుడు. దాంతో పోస్టల్ ఓట్లు కీలకమని వైసీపీ భావిస్తోంది. ఈ ఓట్లతో మెజారిటీ తమకే వస్తాయని ఆ పార్టీ ధీమాగా ఉంటోంది. అందుకే ఇపుడు పోస్టల్ యుద్ధం మొదలుపెట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: