రాజకీయాలు ఇపుడు చాలా తేడాగా ఉంటున్నాయి. నాయకత్వాలు సైతం అదే తీరుని అనుసరించడంతో పార్టీలోని వారు కూడా  షాకులు ఇచ్చేస్తున్నారు. ఒకపుడు సిధ్ధాంతాలు, విలువలు చాలా చెప్పేవారు. ఇపుడు అవన్నీ చాదస్తంగా మారిపోతున్నాయి. జనాలకు లేని అబ్జెక్షన్ మనకేల అన్న ధోరణి బాగా వచ్చేసింది.


ఇక ఫిరాయింపుల కంపు అన్నది భారత రాజకీయాన్ని కట్టి కుదిపేస్తోంది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కెసిన కధ కళ్ళముందే ఉంది. రేపు ఏపీలో ఎన్నికల ఫలితాల్లో గెలిచిన పార్టీ వైపు దూకేందుకు అపుడే రంగం సిధ్ధమైపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముందే వెళ్తే వచ్చే మర్యాద వేరుగా ఉంటుందని కొంతమంది తెలివిన వారు ఫలితాలు ఇలా ఉంటాయని భావించి మరీ అవతల పార్టీని గోకేస్తున్నారుట.


ఓ యువ ఎంపీ అభ్యర్ధి ఈ విధంగా వేరే పార్టీలో చేరేందుకు బేరాలు సాగిస్తున్నట్లు అపుడే న్యూస్ గుప్పుమంటోంది. ఇక స్వయంగా ఓ పార్టీ అధినేత తమ నాయకులను ఉద్దేశించి  రేపు ఎంతమంది జంప్ చేస్తారో, లేక భయపెట్టి చేయిస్తారో ఓ రిపోర్ట్ నా దగ్గర ఉంది అన్నాడంటేనే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అయినా గోడ దూకాలనుకోవాలి కానీ ఎన్ని నిఘాలు పెట్టినా అగుతారా ఏంటి. నీవు నేర్పిన విద్యయే అనుకుంటూ దూకేస్తారు. 


అంటే ఓటమి ఓ వైపు బాధపెడుతూంటే ఆ మాత్రం గెలిచిన నాయకులు కూడా ఇపుడు జంప్ ఐతే ఇంక పార్టీలకు గోదారే తప్ప మరేం లేనట్లుగానే కనిపిస్తోంది. అయినా రాజకీయమంటేనే ఇవన్నీనూ, నీతి, నియమాలకు రోజులెప్పుడో చెల్లిపోయాయి మరి. ఇంతకీ గోడదాటు రాయుళ్ళు ఏ పార్టీలో ఎంతమంది ఏంటో చెప్పాలంటే పెద్ద లిస్టేనా..


మరింత సమాచారం తెలుసుకోండి: