ఈ సారి ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి రాజకీయ వారసులు ఎక్కువ సంఖ్యలో అరంగేట్రం చేసారు. కుటుంబ రాజకీయ వారసత్వం కొనసాగించడానికి ఆసక్తి చూపిస్తూ ప్రజాక్షేత్రంలోకి దిగారు. అయితే కుటుంబానికి ఉన్న రాజకీయ నేపధ్యం. ప్రజలలో పలుకుబడి వారికి భాగా కలిసి వస్తుందనే నమ్మకంతో చాలా మంది ఉన్నారు. ఇక తమకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ సంక్షేమం తమని గెలిపిస్తుందని నమ్మకంతో చాలా మంది రాజకీయ వారసులు ఉన్నారు.


ఇక టీడీపీ రాజకీయ వారసత్వం తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీష అరంగేట్రం చేసారు. తండ్రితో పాటు క్రియాశీల రాజకీయాలలో ఉండి టీడీపీ పార్టీ తరుపున జిల్లా మహిళ లీడర్ గా సముచిత స్థానంలో ఆమె ఉన్నారు. అయితే ఈ సారి తండ్రి వారసత్వం తీసుకొని ఎన్నికల బరిలో ఉంది. పలాస టీడీపీ కంచుకోట కారణంగా ఆమెకి గెలుపు అవకాశాలు భాగానే ఉన్నాయి అనేది అక్కడ వినిపిస్తున్న మాట.


విజయనగరం అసెంబ్లీ నుంచి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథి పోటీ చేశారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కుమార్తెల గెలుపు బాధ్యతలను తండ్రులు భుజానవేసుకున్నారు. అయితే విజయనగరంలో అశోక గజపతి కుమార్తె గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ఈ సారి వైసీపీ పార్టీ నుంచి బలమైన అభ్యర్ధి బరిలో ఉన్నారు. అలాగే జిల్లాలో రాజకీయంగా పెద్ద కుటుంబం అయిన బొత్స ఫ్యామిలీ సపోర్ట్ ఎంపీ అభ్యర్ధికి ఉంది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది.


ఇక అరకు నుంచి దివంగత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు మంత్రి శ్రావణ్ కుమార్ పోటిచేశారు, చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి మృణాళిని తనయుడు నాగార్జున పోటిచేయ‌గ అలాగే తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నుంచి వరుపుల రాజా, రాజ‌మండ్రి నుండి అదిరెడ్డి భ‌వాని పోటిచేశారు. కృష్ణాజిల్లా పెడన లో సీనియర్ నేత కాగిత వెంకట్రావు తన వారసుడు కృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇప్పించుకున్నారు.


అలాగే విజయవాడ పశ్చిమ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ ను రంగంలోకి దించారు. ఇప్పుడు వీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉన్న‌ట్లు తెలుస్తుంది. అలాగే గుడివాడ నుండి పోటి చేసిన దేవినేని అవినాష్ కి కొడాలి నాని నుంచి గట్టి షాక్ తగిలే అవకాశం ఉందనేది రాజకీయంగా వినిపిస్తున్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: