చంద్రబాబునాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల పై 2005లో లక్ష్మీపార్వతి వేసిన కేసుపై ఏసిబి కేసు విచారణ మొదలుపెట్టింది. చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి ఏసిబి కోర్టులో కేసు వేశారు. అయితే విచారణను నిలిపేయాలంటూ చంద్రబాబు హై కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు.

 

ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబుపై కేసు స్టేలోనే కోల్డో స్టోరేజిలో ఉండిపోయింది. అయితే దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉండిపోయిన వేలాది కేసులను వెంటనే పరిష్కరించాలని సుప్రింకోర్టు ఆమధ్య ఆదేశాలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సుప్రింకోర్టు ఆదేశాలను అనుగుణంగానే ఏసిబి కోర్టు కూడా నడుంబిగించింది.

 

అందులో భాగంగానే చాలా కాలంగా పెండిగ్ లో ఉన్న కేసులపై వెంటనే విచారణ జరపాలని ఏసిబి కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయం వల్లే ఇపుడు చంద్రబాబుపై పెండింగ్ లో ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ మొదలవ్వబోతోంది. ఈ రోజు జరిగిన విచారణకు లక్ష్మీపార్వతి హాజరయ్యారు కూడా. మే 13వ తేదీన కేసును విచారణ చేపట్టనున్నట్లు ఏసిబి కోర్టు లక్ష్మీపార్వతికి తెలియజేసింది.

 

సమస్యలు వస్తే ఒంటిరిగా రావన్న విషయం చంద్రబాబు విషయంలో రుజువవుతోందేమో. అసలే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు ఏసిబి కోర్టు నిర్ణయం బిగ్ షాకనే చెప్పాలి. ఎందుకంటే, ఈ కేసులో బహుశా మళ్ళీ ఏ కోర్టు కూడా స్టే ఇవ్వకపోవచ్చు. అంటే మే 13న మొదలయ్యే కేసులో ప్రత్యక్షంగానో పరోక్షంగానే చంద్రబాబు హాజరవ్వక తప్పేట్లు లేదు. దాంతో పాటు స్టేలో ఓటుకునోటు లాంటి మరిన్ని కేసుల విచారణ కూడా మొదలయ్యేట్లే ఉన్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: