మొత్తానికి టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంత మొత్తుకుంటూంటే అంతలా సీబీఐ, ఈడీ, ఐటీ ఇలా వరసగా పిలుపులు వస్తూనే ఉన్నాయి. అవినీతి అంటూ ఇతరులపైన వేలెత్తి చూపించే టీడీపీ పెద్దలు తన చుట్టూ ఉన్న వారి విషయంలో మాత్రం ఏమీ అనరు. . అంతా సుద్దపూసలే అంటూ వెనకేసుకువస్తారు. 


ఇదిలా ఉండగా సీబీఐ నుంచి పిలుపు రావడంతో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఈ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు బెంగుళూరు బయల్దేరివెళ్ళారు. 2017లో బెస్ట్ అండ్ క్రాప్టన్ కంపెనీ వ్యవహారంలో ఆంధ్రా బ్యాంకును  71 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లుగా బెంగుళూరులో సుజనాపై కేసు నమోదు అయింది. దీనికి సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందినా సుజనాకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.


దీంతో సుజనా చౌదరి సీబీఐ ఎదుట హాజరవుతున్నారు. ఇక ఎండీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత తమ పార్టీ నేతలను లక్ష్యంగా
చేసుకుని ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారనే  ఆ పార్టీనేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా అవి ఆగడంలేదు. నేతలను వెంటాడక మానడంలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: