తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసాయి.  అయితే జరిగిన అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ నెగ్గుతూ వచ్చింది.  ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ఉన్న విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల పరిధిలో ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది.

ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని, ఈ విషయమై పున: పరిశీలించాలని కోరుతూ వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 

కాగా, ఈ పిటీషన్ పై  విచారణ జరిపిన న్యాయస్థానం ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.  వేములవాడ రూరల్ లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ స్టే విధించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: