తెలుగు రాష్ట్రాల‌కు బీజేపీ రుణ‌ప‌డి ఉండాలి.  ఇంకా చెప్పాలి అంటే..తెలుగోళ్ల‌ను బీజేపీ నేత‌లు జీవితాంతం గుర్తుకు ఉంచుకోవాలి. ఎందుకంటారా...న‌ల‌బై సంవ‌త్స‌రాల‌ చ‌రిత్రలో ఏనాడు ద‌క్కని గుర్తింపు ఇప్పుడు బీజేపీకి ద‌క్కింది. దానికి కార‌ణం తెలుగు వారే. తెలుగు రాష్ట్రాల వ‌ల్లే ఈ రికార్డు బీజేపీ సొంత‌మైంది. 


ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గానూ బీజేపీ సొంతగా 437 మందికి టికెట్లిచ్చింది. మిగిలిన 106 స్థానాల్లో ఎన్డీఏలోని ఇతర పార్టీలు పోటీచేస్తున్నాయి. అదే కాంగ్రెస్, ఈసారి సొంతగా 428 మంది క్యాండేట్లను ప్రకటించింది. మిగిలిన 115 సీట్లను యూపీఏభాగస్వాములకు వదిలేసింది. జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీకిదిగడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. 


అయితే, ఈ రికార్డులో తెలుగు రాష్ట్రాల‌ది కీల‌క పాత్ర‌. ఎందుకంటే...నిజానికి బీజేపీకి వివిధ రాష్ట్రాలకు చెందిన19 పార్టీలతో పొత్తున్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాలే. గతంలో టీడీపీతో ప్రీపోల్ పొత్తు పెట్టుకున్న బీజేపీ, ఈసారి తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్ లోని 25స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏ పార్టీ పొత్తుపెట్టుకోలేదు. త‌ద్వారా ఇలా రికార్డు సొంతం చేసుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: