ఏపీలో నిన్నటి వరకు ప్రతిపక్షాలు, కేంద్రం, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నికల సంఘం, ఈవీఎంలు ఇలా ఎవ‌రు క‌న‌ప‌డితే వారిపై లేనిపోని, ప‌స‌లేని విమ‌ర్శ‌లు చేసుకుంటూ వ‌చ్చిన టీడీపీ ప్ర‌భుత్వం ఇప్పుడ సీఎస్‌ను టార్గెట్‌గా చేసుకుంటోంది.  ఏపీలో గత కొద్ది రోజులుగా టిడిపి నాయకులు వర్సెస్ సీఎస్ ఎల్‌వి. సుబ్రహ్మణ్యం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు కొద్ది రోజులుగా కొన్ని అంశాలపై సమీక్షలు చేస్తున్నారు. దీనిపై విపక్షాలతో పాటు,  కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాలు రాకుండానే ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఎలా ?  స‌మీక్ష‌లు చేస్తార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.


ఈ విమ‌ర్శ‌ల‌పై చంద్రబాబు మాట్లాడుతూ  వచ్చే నెల 7వ తేదీ వరకు తాను ముఖ్యమంత్రిని అని అప్పటి వరకు సమీక్షలు చేసే హక్కు తనకు ఉందని చెప్పారు. దీనికి కౌంటర్‌గా సిఎస్ మాట్లాడుతూ చంద్రబాబు పవర్ లెస్ సీఎం అని చురకలు అంటించారు. ఈ వివాదం నడుస్తూ ఉండగానే టిడిపి అధికారులు ఎల్‌వీ. సుబ్రమణ్యంపై సరికొత్త ఆరోపణలు చేశారు.ఓ సీఎస్ హోదాలో ఉన్న వ్యక్తి  ఇప్పటికే చాలామంది అధికారుల వద్ద ఏపీలో ప‌లానా ప్రభుత్వం ఏర్పడబోతోంది.... ప‌లానా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ప్రచారం చేస్తుండ‌డాన్ని ఇది ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. టిడిపి నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఎల్‌వీ. సుబ్రమణ్యం ఐఏఎస్ అధికారుల వద్ద ఏపీలో వచ్చేది వైసిపి ప్రభుత్వమే అని,  కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పినట్టు స్పష్టంగా తెలుస్తోంది. 


ఎల్‌వి సుబ్రహ్మణ్యం మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తుందని చెబితే అందుకు టిడిపి వాళ్ళు సహజంగానే అభ్యంతరాలు వ్యక్తం చేయరు. ఎల్‌వి. సుబ్రహ్మణ్యం ఏపీలో మళ్ళీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని.. ఈ క్రమంలోనే మనం ఎంత స్ట్రిక్ట్‌గా పని చేసినా టీడీపీ నుంచి ఎలాంటి  ? ఇబ్బంది ఉండదని కూడా ఇప్పటికే తోటి అధికారులకు చెప్పినట్టు సమాచారం. ఎల్‌వి. సుబ్రహ్మణ్యం చెప్పిన వాస్తవాలను జీర్ణించుకోలేని టిడిపి నేతలు తమ అక్కసు అంతా సీఎస్ పై చూపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎల్‌వి. సుబ్రమణ్యం చెప్పార‌నో ? లేదా మరొకరు చెప్పార‌నో ఐఏఎస్‌లు ఆ మాటలు ఫాలో అయ్యే స్థాయిలో ఉండ‌రు. సీనియర్ అధికారులు అయినవారు వారికున్న మార్గాల ద్వారా ఏపీలో ఎవరు ? గెలుస్తారు, ఎవరి ? ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న దానిపై తమ లెక్కల్లో తాము ఉంటారు. టిడిపి ఇక్కడ  సీఎస్‌ అధికారులకు లింకు పెట్టి విమర్శలు చేయడం కూడా సమంజసం కాదు. 


కేవలం ఫలితాలు తమకు వ్యతిరేకంగా రాబోతున్నాయనో లేదా తమ నాయకుడు చంద్రబాబు అందరిని విమర్శిస్తున్న కోణంలో  తాము కూడా ఏదో చెయ్యాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాం అన్నట్టుగానే సీఎస్‌ను టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతోంది.  సీఎం చంద్రబాబుతో పాటు, టిడిపి నాయకుల చేష్టలు చూస్తుంటే సీనియర్ అధికారులపై, చట్టాలు, వ్యవస్థలపై వీరికి ఉన్న నమ్మకం ఎలాంటిదో ? అర్థమవుతోంది. ఏదైనా తమకు అనుకూలంగా ఉంటే మంచిది లేకపోతే.... దానిపై బురద జల్లడం అన్న సంస్కృతి చంద్రబాబు & టిడిపి నాయకుల‌కు మంచిది కాదు.. అది ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి కూడా విరుద్ధం.


మరింత సమాచారం తెలుసుకోండి: