కౌంటింగ్ కు ఇంకా 28 రోజులు గడువుండటంతో గెలుపోటములపై ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. వ్యక్తులతో పాటు సంస్ధలు, మీడియా లెక్కలంటూ కొన్ని గణాంకాలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే జనసేన సన్నిహిత వర్గాలు  కూడా  పోలింగ్ తర్వాత సర్వే నిర్వహించినట్లు  సమాచారం. వాళ్ళ లెక్కప్రకారం 25 పార్లమెంటు స్ధానాల్లో వైసిపికి  23 సీట్లు వస్తాయని తేలిందట. మిగిలిన రెండు సీట్లలో టిడిపి, జనసేనతో టైట్ ఫైట్ నడిచిందని సమాచారం.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలోని ఐదు పార్లమెంటు స్ధానాల్లో నాలుగు సీట్లు వైసిపి ఖాతాలో పడినట్లేనట. శ్రీకాకుళం, విజయనగరం, అరకు, అనకాపల్లి స్ధానాల్లో వైసిపి గెలుపు తథ్యమట. మిగిలిన విశాఖపట్నం సీటులో వైసిపి-జనసేన మధ్య పోటీ రసవత్తరంగా జరిగిందట. అందుకనే ఫలితం తేల్చలేకపోయారు.రాయలసీమలో ఎనిమిది సీట్లున్నాయి. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు మొత్తాన్ని వైసిపి స్వీప్ చేస్తుందని సమాచారం. తిరుపతి, చిత్తూరు, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, హిందుపురం, అనంతపురం పార్లమెంటు సీట్లు వైసిపి ఖాతాలోనే పడతాయట.

 

ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఐదు సీట్లున్నాయి. ఐదు సీట్లు రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, ఏలూరు సీట్లలో వైసిపి జెండా ఎగరటం ఖాయమని జనసేన సన్నిహిత వర్గాలు తేల్చాయి.  అలాగే నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఏడు సీట్లలో నాలుగింటిలో వైసిపిదే పై చేయిగా తేల్చారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, మచిలీపట్నంలో కూడా వైసిపి హవానే కనిపించిందట. బాపట్ల పార్లమెంటులో మాత్రం వైసిపి, టిడిపి మధ్య గట్టి పోటీ జరిగిందని సమాచారం.

 

జనసేన సన్నిహిత వర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు కట్టాయి. దాని ప్రకారం అసెంబ్లీలతో పాటు పార్లమెంటుకు కూడా ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో అంచనా వేశాయి. దాని ప్రకారమే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో అంచనాకు వచ్చాయి. 23 పార్లమెంటు సీట్లు వైసిపి పరమవుతాయని అనుకుంటే అదే దామాషాలో కాస్త అటు ఇటుగా అసెంబ్లీలను కూడా వైసిపి గెలుచుకోవటం ఖాయం.

 

జనసేన సన్నిహిత వర్గాల అంచనా ప్రకారం వైసిపికి సుమారు 123 సీట్లొస్తాయని తేలింది. టిడిపి ఖాతాలో 32 సీట్లేశారు. వైసిపి, టిడిపికి సమాన అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు 18గా తేలాయి. అలాగే మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి, జనసేన మధ్య గట్టి పోటీ నడిచిందట. ఈ అంచనాలేవో కాస్త నమ్మేట్లే ఉన్నాయని అనుకుంటున్నారు. మరి చూద్దాం ఇలాంటి అంచనాలు ఇంకెన్ని వస్తాయో ? 

నియోజకవర్గాల వారీగా గెలుపోటముల అంచనా ఈ విధంగా ఉంది.

1. అరకు(ఎస్టీ)

టీడీపీ- వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్

వైసీపీ-గొడ్డేటి మాధవి

జనసేన-శ్రీ పంగి గంగులయ్య

గెలుపు-వైసీపీ

2. శ్రీకాకుళం

టీడీపీ- కింజరాపు రామ్మోహన్ నాయుడు

వైసీపీ-దువ్వాడ శ్రీనివాస్

జనసేన-శ్రీ మెట్ట రామారావు

గెలుపు-వైసీపీ

3. విజయనగరం

టీడీపీ- అశోక్ గజపతి రాజు

వైసీపీ-బెల్లాన చంద్రశేఖర్

జనసేన-శ్రీ ముక్కా శ్రీనివాసరావు

గెలుపు-వైసీపీ

4. విశాఖపట్నం

టీడీపీ-ఎం. భరత్

వైసీపీ-ఎంవీవీ సత్యనారాయణ

జనసేన-శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ     

వైసీపీ, జనసేన సమాన అవకాశాలు-50-50

5. అనకాపల్లి

టీడీపీ- అడారి ఆనంద్

వైసీపీ-బీవీ సత్యవతి

జనసేన-చింతల పార్థసారథి          

గెలుపు-వైసీపీ

6. కాకినాడ

టీడీపీ- చలమలశెట్టి సునీల్

వైసీపీ-వంగా గీత

జనసేన-జ్యోతుల వెంకటేశ్వరరావు

గెలుపు-వైసీపీ

7. అమలాపురం

టీడీపీ- గంటి హరీశ్

వైసీపీ-చింతా అనురాధా

జనసేన-డీఎంఆర్ శేఖర్     

గెలుపు-వైసీపీ

8. రాజమండ్రి

టీడీపీ-మాగంటి రూప

వైసీపీ-మార్గాని భరత్

జనసేన-ఆకుల సత్యనారాయణ

గెలుపు-వైసీపీ

9. నర్సాపురం

టీడీపీ- శివరామరాజు వేటుకూరి

వైసీపీ-వేటూకూర శివ

జనసేన-కె. నాగేంద్రబాబు

గెలుపు-వైసీపీ

10. ఏలూరు

టీడీపీ-మాగంటి బాబు

వైసీపీ-కోటగిరి శ్రీధర్

జనసేన-పెంటపాటి పుల్లారావు

గెలుపు-వైసీపీ

11. విజయవాడ

టీడీపీ- కేశినేని నాని

వైసీపీ-పొట్లూరి వరప్రసాద్

జనసేన-ముత్తంశెట్టి లక్ష్మణ శివప్రసాద్ బాబు

గెలుపు-వైసీపీ

12. మచిలీపట్నం

టీడీపీ- కొనకళ్ల నారాయణ

వైసీపీ-బాలశౌరి

జనసేన-బండ్రెడ్డి రామకృష్ణ

గెలుపు-వైసీపీ

13. గుంటూరు

టీడీపీ- గల్లా జయదేవ్‌

వైసీపీ-మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

జనసేన-బి.శ్రీనివాస్

గెలుపు-వైసీపీ

14. నర్సారావుపేట

టీడీపీ- రాయపాటి సాంబశివరావు

వైసీపీ-లావు కృష్ణదేవరాయులు      

జనసేన-నయూబ్ కమాల్

గెలుపు-వైసీపీ

15. బాపట్ల

టీడీపీ- శ్రీరాం మాల్యాద్రి

వైసీపీ-నందిగం సురేశ్

బీఎస్పీ-కె.దేవానంద్

గెలుపు-50-50

16. ఒంగోలు

టీడీపీ- శిద్దా రాఘవరావు

వైసీపీ-మాగుంట శ్రీనివాసరెడ్డి          

జనసేన-బెల్లంకొండ సాయిబాబు

గెలుపు-వైసీపీ

17. నెల్లూరు

టీడీపీ-బీదా మస్తాన్‌రావు

వైసీపీ-అదాల ప్రభాకర్ రెడ్డి

సీపీఎం-చండ్ర రాజగోపాల్

గెలుపు-వైసీపీ

18. కడప

టీడీపీ- ఆది నారాయణరెడ్డి

వైసీపీ-వైఎస్ అవినాశ్ రెడ్డి  

సీపీఐ-జె.ఈశ్వరయ్య

గెలుపు-వైసీపీ

19. రాజంపేట

టీడీపీ- డీకే సత్యప్రభ

వైసీపీ-మిథున్ రెడ్డి   

జనసేన-సయ్యద్ ముకరం చాంద్

గెలుపు-వైసీపీ

20. హిందూపురం

టీడీపీ-నిమ్మల కిష్టప్ప

వైసీపీ-గోరంట్ల మాధవ్         

జనసేన-కరిముల్లా ఖాన్      

గెలుపు-వైసీపీ

21. అనంతపురం

టీడీపీ- జేసీ పవన్‌రెడ్డి

వైసీపీ-తలారి రంగయ్య       

గెలుపు-వైసీపీ

22. నంద్యాల

టీడీపీ- మాండ్ర శివానంద్‌రెడ్డి

వైసీపీ-పి.బ్రహ్మానంద రెడ్డి   

జనసేన-ఎస్పీవై రెడ్డి

గెలుపు-వైసీపీ

23. కర్నూలు

టీడీపీ- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

వైసీపీ-డా.సంజీవ్ కుమార్   

సీపీఎం-కె. ప్రభాకర్ రెడ్డి

గెలుపు-వైసీపీ

24. తిరుపతి(ఎస్సీ)

టీడీపీ- పనబాక లక్ష్మి

వైసీపీ-బల్లి దుర్గాప్రసాద్     

బీఎస్పీ- డాక్టర్‌ శ్రీహరిరావు

గెలుపు-వైసీపీ

25. చిత్తూరు

టీడీపీ- శివ ప్రసాద్‌

వైసీపీ-రెడ్డెప్ప

బీఎస్పీ-పుణ్యమూర్తి

గెలుపు-వైసీపీ


మరింత సమాచారం తెలుసుకోండి: